కడపలో తగ్గనున్న వైసీపి హవా..రీజన్ ఇదేనా..?     2018-07-01   00:48:24  IST  Bhanu C

చీమ పాటం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది కదా..నా చీమల పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అంటుంది గుర్తుకు వచ్చింది కదూ..ఇప్పుడు సరిగ్గా అదే జరుగబోతోంది ఏపీ రాజకీయాల్లో..ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా వెళ్ళినప్పుడు అక్కడ చంద్రబాబు ఇలాఖాలో తొడకొట్టి తెలుగుదేశాన్ని ఓడిస్తా అంటూ శపధం చేశారు..చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు..అయితే సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు మాత్రం ఆ సమయంలో చాలా సైలెంట్ అయ్యారు..ఇక్కడ సుదీర్ఘమైన అని ఎదుకు అనాల్సి వచ్చిందటే..మీకు చివర్లో తెలుస్తుంది..ఇదిలాఉంటే

పాదయాత్ర చిత్తూరు దాటి వెళ్ళిపోయింది..ఇక రాజకీయం మొదలయ్యింది..చంద్రబాబు అడ్డాలోకి వచ్చి మరీ తొడగొట్టి వెళ్తే చూస్తూ ఊరుకుంటారా చంద్రబాబు..జగన్ కి చెక్ పెట్టడానికి అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.. ఇప్పటికే కడపలో వైఎస్ బ్రతికుండా చేయలేని ఒక మహత్తర కార్యక్రమాన్న…వైఎస్ కుటుంబం పరిష్కరించలేని నీటి సమస్యను చంద్రబాబు ఓ కొలిక్కి తెచ్చారు…గండికోట ప్రాజెక్టుకి కృష్ణాజలాలను తరలించి.. అక్కడనుంచి పులివెందుల ప్రాంతంలోని చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులకు నీరందించారు.