జగన్ కి మీడియా ఎఫెక్ట్ గట్టిగా తగిలిందా .... సొంత మీడియా ఏంచేస్తోంది ..     2018-08-16   11:19:15  IST  Sai M

ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఇప్పుడు రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కుంటోంది. రాజకీయంగా ఆ పార్టీకి ఇతర పార్టీల మద్దతు లేకపోవడం, సామాజిక సమీకరణాలు, మీడియా మద్దతు ఇలా చాలా విషయాల్లో జగన్ వెనకబడిపోయి రాజకీయంగా అనేక ఇబ్బందులు పడుతున్నాడు. ముఖ్యంగా మీడియా విషయంలో జగన్ ఏకాకిగా మిగిలిపోయాడు. తెలుగు రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్న ప్రధాన మీడియా సంస్థలన్నీ ఒకే సామజిక వర్గానికి చెందినవి కావడం అవన్నీ ప్రత్యక్షంగానో , పరోక్షంగానో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండడం వైసీపీ వెనుకబాటుతనానికి మరో కారణం.

ప్రస్తుతం ఏపీ ప్రజలకు జగన్ పై సానుభూతి బాగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ అది ఎక్కడా ఫోకస్ అవ్వడం లేదు అంతే. వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడించే అవకాశం పుష్కలంగా ఉన్నా వాటిని తన పార్టీకి అనుకూలంగా మార్చుకోవడంలో మాత్రం జగన్ వెనకబడిపోయాడు. టీడీపీ వైఫల్యాలను ప్రజలల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సొంత మీడియా ఉండి కూడా జగన్ విఫలం అవుతున్నాడనే చర్చలు సాగుతున్నాయి.

Telugu Media,ys Jagan,YS Jagan Facing Problems From Telugu Media

వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా … చంద్రబాబు టీడీపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధం అయ్యాడు. ఈ వ్యవహారం టీడీపీ లో మెజార్టీ నాయకులకు కూడా రుచించడంలేదు. నిజానికి ఇది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సిద్ధాంతాలకు తీవ్ర వ్యతిరేకం. అయినప్పటికీ.. అధికారం కోసం బాబు ఆరాటపడుతూ ఈ విధంగా చేస్తున్నాడు. పార్లమెంటులో కేంద్రంలోని ప్రధాని నరేంద్రమో డీ సర్కారుపై అవిశ్వాసం ప్రకటించడం వెనుక కూడా కాంగ్రెస్ మద్దతును కూడగట్టారు. ఈ పరిణామాలను జగన్ వైసీపీకి అనుకూలంగా మార్చుకోలేక పోయారు. అంతే కాదు సొంత మీడియా ఉండి కూడా సరైన విధంగా ఆ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు.

కానీ ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే బాబు మాత్రం విజయవంతంగా వైసీపీ కి ముడిపెట్టి రాజకీయ లబ్ది పొందుతున్నాడు. దీనికి బాబు అనుకూల మీడియా మద్దతు బాగా ఉపయోగపడుతోంది. కాపు ఉద్యమం సమయంలో తుని సంఘటనను వైసీపీకి లింక్ పెట్టి బాబు సక్సెస్ అయ్యారు. ముద్రగడ పద్మనాభం వెనుక వైసీపీ ఉందని, ఆయన్ను నడిపించేది జగన్ అని ప్రచారం చెయ్యడంలో బాబు సక్సెస్ అయ్యాడు. నిన్న మొన్నటి వరకు బీజేపీతో జగన్ అంటకాగారంటూ.. చేసిన ప్రచారం కూడా ప్రజల్లోకి బలంగానే వెళ్ళింది. కానీ జగన్ అదంతా వట్టిదే బాబు ఆడిస్తున్న డ్రామా ఇది అని చెప్పుకోవడంలో జగన్ ఆయన మీడియా సంస్థలు కూడా ఘోరంగా విఫలం అయ్యాయి. ఇదంతా జగన్ చేజేతులా చేసుకుంటున్న తప్పిదమే.

Telugu Media,ys Jagan,YS Jagan Facing Problems From Telugu Media

జగన్ మీడియా మీద వైసీపీలోనే చాలామంది నేతలు ఆగ్రహంగా ఉన్నారు. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు స్థానికంగా కూడా వైసీపీ నాయకుల కంటే టీడీపీ నాయకుల అనుకల కథనాలే జగన్ మీడియా లో ఫోకస్ అవుతున్నాయని, స్థానిక విలేకరులు కూడా టీడీపీ నేతల చేతిలో కీలు బొమ్మలుగా మారారని విమర్శలు చెలరేగుతున్నాయి. వీటన్నిటి పై జగన్ దృష్టిపెట్టి తన మీడియా సహకారంతో ధీటుగా ఎదురుదాడి చేయకపోతే జగన్ ఎన్ని యాత్రలు చేసినా ఆశించిన ఫలితం మాత్రం కనిపించదు.