పశ్చిమలో జగన్ డేరింగ్ డెసిషన్..     2018-05-17   02:55:44  IST  Bhanu C

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమలో చేస్తున్న పాదయాత్ర ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది..దెందులూరు ఏలూరు నియోజకవర్గాలలో తన పాదయాత్రను ముగించుకున్న జగన్ మోహన్ రెడ్డి..తన తరువాతి టూర్ ని గురువారం నాటికి గోపాలపురం నియోజకవర్గంతో ప్రారంభించనున్నాడు..అయితే పశ్చిమాలో ఎంతో కీలక నియోజకవర్గం అయిన ఏలూరు లో జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు..గతంలో ఈ నియోజకవర్గం నుంచీ వైసీపీ ఎమ్మెల్యే గా నాని గెలుచుకున్న విషయం అందరికి తెలిసిందే నాని నాలుగుసార్లు పోటీ చేయగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే

గత ఎన్నికల్లో నాని బడేటి బుజ్జి చేతిలో ఒడిపోగా జగన్ నానికి ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీలో సముచిత స్థానం ఇచ్చారు.ఇదిలాఉంటే నాని స్థానాన్ని భర్తీ చేయడం కోసం మాజీ మున్సిపల్ చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరిని సమన్వయ కర్తగా నియమించారు..అయితే ఈశ్వరి భర్త బలరాం కి ఇక్కడ మంచి పట్టు ఉండటంతో పాటుగా కాపు సాయమాజిక వర్గానికి చెందిన నేత అవడం మరియు నాని సామాజిక వర్గం మరియు నాని ఫాలోవర్స్ సైతం ఈశ్వరికి సపోర్ట్ చేసే అవకాశం ఉండటంతో గెలుపు అత్యంత సునాయసనం అవుతుందనేది జగన్ స్కెచ్.