పులివెందుల‌కు జ‌గ‌న్ గుడ్ బై...ఆ జిల్లా నుంచే అసెంబ్లీకి పోటీ..!     2018-05-01   21:48:50  IST  Bhanu C

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పులివెందుల‌కు గుడ్ బై చెప్ప‌నున్నారా ? నాలుగు ద‌శాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట‌గా ఉంటోన్న పులివెందుల నుంచి త‌న ఫ్యామిలీ స‌భ్యుల‌ను రంగంలోకి దింపి పార్టీకి ఊపు తెచ్చేందుకు జ‌గ‌న్ మ‌రో జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారా ? అంటే అవున‌నే సంకేతాలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. క‌డ‌ప జిల్లాలోని పులివెందుల‌తో పాటు ఈ జిల్లాలో ఆరేడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి, జ‌గ‌న్ ఫ్యామిలీకి స్థిర‌మైన ఓటు బ్యాంకు ఉంది. ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌పున ఎవ‌రు పోటీ చేసినా గెలిచేందుకు సులువుగా ఛాన్సులు ఉంటాయి.

గ‌తంలోనే జ‌గ‌న్ తండ్రి వైఎస్‌, త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మితో పాటు ఇప్పుడు జ‌గ‌న్ వీళ్లంతా పులివెందుల నుంచే ఎమ్మెల్యేలుగా గెలిచారు. క‌మ‌లాపురం నుంచి మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ఎమ్మెల్యే, ఇక రాయ‌చోటి నుంచి జ‌గ‌న్ బెస్ట్‌ఫ్రెండ్శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. జ‌మ్మ‌ల‌మ‌డుగుతో పాటు క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైఎస్ ఫ్యామిలీకి 20 శాతం స్థిర‌మైన ఓటు బ్యాంకు ఉంది. ఇక్క‌డ వైఎస్ ఫ్యామిలీ నుంచి ఎవ‌రు నిల‌బ‌డినా సులువుగానే గెలుస్తారు. జ‌గ‌న్‌తో పాటు జ‌గ‌న్ సోద‌రుడు అవినాష్‌రెడ్డి, మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, రేపు వైఎస్‌.వివేకానంద‌రెడ్డితో పాటు జ‌గ‌న్ స‌న్నిహితులు అయిన శ్రీకాంత్‌రెడ్డి లాంటి వాళ్లు అంద‌రూ క‌డ‌ప జిల్లా నుంచే పోటీ చేస్తే ఆ ఊపు కేవ‌లం ఈ జిల్లా వ‌ర‌కే ఉంటుంద‌ని జ‌గ‌న్ టీం డిసైడ్ అయ్యింది.