జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూ లో జగన్ షాకింగ్ కామెంట్స్  

జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..ఎన్నడూ లేని విధంగా జగన్ ఈ సారి జాతీయ మీడియాలో తండ్రి వైఎస్ ప్రస్తావన తెస్తూ చేసిన కామెంట్స్ కానీ తనపై వ్యక్తిగతంగా చేసుకున్న కామెంట్స్ కానీ ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి..జగన్ అప్పుడప్పుడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఉంటారు..మాట్లాడే ప్రతీ సారి చంద్రబాబు పై విరుచుకుని పడే జగన్ ఈ సారి మాత్రం ఈ షాకింగ్ కామెంట్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు..

ఇంతకీ జగన్ ఏమన్నారంటే…

తన తండ్రిలా ప్రారంభించిన పాదయాత్ర తనకి తనలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని అంటున్నారు జగన్ మోహన్ రెడ్డి జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడిన జగన్ తన పాదయాత్ర తనలో ఎంతో మార్పు తీసుకుని వచ్చిందని అన్నారు..అంతేకాదు తన తండ్రితో పోలిస్తే తనకు కోపంఅ చాలా తక్కువని తన తండ్రికి ఉన్న కోపం అనే నరం తనకి లేదని అన్నారు..ఇప్పుడు చూస్తున్న జగన్ కు ఎంతో వ్యత్యాసముందని ఆయన చెప్పారు..

ప్రజల కష్టాలు కన్నీళ్లు దగ్గర ఉండి మరీ చూశాను..ప్రభుత్వాలు ఎన్నో ఎన్నో పధకాలు ఏర్పాటు చేశాయి అంటున్నాయి కానీ ఇంకా వారి కష్టాలు తీరలేదు అయితే ముందు నుంచీ తనపై దుష్ప్రచారం చేశారని..తనకి కోపం ఎకువగా ఎవరి మాటా వినను అని అన్నారని అంటూ ఆ వ్యాఖ్యలకి క్లారిటీ ఇచ్చారు జగన్..తనకు నలుగురు సలహాలు ఇస్తే వాటిలో ఏది మంచిదో దానిని ఆచరిస్తానని చెప్నారు. ” నలుగురు ఇచ్చిన సలహాల్లో ఏది బాగుంటే అదే తీసుకుంటా. దీంతో మిగిలిన ముగ్గురూ జగన్ మా మాట వినలేదు అని అనుకుంటారని దానికి నాపై విష ప్రచారం కావాలని చేసేవారని అన్నారు…

తన తండ్రి వైఎస్ లా తాను చెప్పిన మాటపై నిలబడే వ్యక్తినని చంద్రబాబు లా అబద్దాలు చెప్పడం నాకు చేతకాదని అన్నారు జగన్ మోహన్ రెడ్డి ” రాష్ట్రంలో రైతు రుణ మాఫీ అసాధ్యమని నాకు తెలుసు. అందుకే నేను ఆ హామీ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు మాత్రం ఆ హామీ ఇచ్చారు. దాంతో అధికారంలోకి వచ్చారు. రుణమాఫీ పూర్తిగా చేశారా… అదీ లేదు. ” అని జగన్మోహన్ రెడ్డి తెలిపారు…అయితే జగన్ తానూ పూర్తిగా మారిపోయాను అని చెప్పడం వెనుక అంతకు ముందు తప్పకుండా మూర్ఖంగా ఉండటమే కదా లేదంటే ఆ వివరణ ఎందుకు ఇస్తారు మరి ఇంటర్వ్యూ లో నా మీద లేని పోనివి చెప్తున్నారు అని ఎందుకు చెప్తున్నారో జగన్ కే తెలియాలి అంటున్నారు టీడీపీ నేతలు,