పవన్ స్పీడుకి బ్రేకులు వేస్తున్న జగన్     2017-10-11   02:04:33  IST  Bhanu C

జగన్ జోరు తగ్గుతోంది..నంద్యాల,కాకినాడ ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ హవా ఎక్కడా కనపడటం లేదు అంటూ వస్తున్నా వార్తలకి..జగన్ చాలా ఘాటుగానే సమాదానం ఇవ్వబోతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా వర్క్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు అనే భావన..తెలుగుదేశం ఈ హోదా విషయంలో రాజీ పడింది అనే ఆగ్రహం ప్రజలలో బలంగా ఉంది. ఇప్పుడు ఇదే అస్త్రంగా దూసుకుపోనున్నారు జగన్మోహన్ రెడ్డి. నవంబర్ 2వ తేదీ నుంచి ఆరు నెలల పాటు ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఈ పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మేర కొనసాగుతుంది.

పాదయాత్ర ప్రారంభానికి ముందే ప్రతీ నియోజకవర్గంలో యువభేరిలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు..అంతేకాదు తన పాదయాత్ర చేయబోయే నియోజక వర్గంలో తానూ వెళ్ళే సరికే ప్రతేక్యహోదా ఉద్యమం ప్రజలలో చొచ్చుకుని పోయేలా కార్యక్రమాలు చేయాలని చెప్పారు. అందుకోసమే జగన్ అన్ని నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, ఇన్ ఛార్జులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే వారికి దిశానిర్దేశం చేయనున్నారు.ఈ విషయంలో జగన్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు..ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న రీతిలో తన పాదయాత్రతో ఒకేసారి..పవన్ కళ్యాణ్ ..చంద్రబాబు నాయుడు ఇద్దరికీ చెక్ పెట్టనున్నారు.