“సంచలనం” సృష్టిస్తున్న జగన్ “ఏడు ప్రశ్నలు”     2018-04-07   09:25:47  IST  Bhanu C

ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు పై విమర్శలు ఎక్కుపెట్టారు..ప్రత్యేక హోదా విషయంలో మేము మాట్లాడిన తరువాత ఇప్పుడు ఏపీ కి అన్యాయం జరిగింది అంటూ అరుస్తున్న చంద్రబాబు నీ చిత్త శుద్ది ఎంతవరకూ ఉంది అంటూ ప్రశ్నించారు అధికారం చేపట్టిన సమయం నుంచీ చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఏమి పాటుపడ్డారో వివరించాలని డిమాండ్ చేశారు..ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ మొదట్నుంచి ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు చేసిందన్నారు. మొదటగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. ఆంధ్రల గొంతుగా నిలిచామని అన్నారు..

చంద్రబాబు ఢిల్లీ పర్యటన హోదా ఉద్యమం నేపధ్యంలో జగన్ సీఎం కి లేఖ రాశారు.. ఢిల్లీ యాత్ర కోసం చర్చించడానికి అఖిల పక్షంతో చర్చించడానికి సమావేశం పెడుతున్నారట. అక్కడ హేమ మాలినితో ఏమి మాట్లాడారో చెప్పడానికట.. అంటూ ఎద్దేవా చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఎక్కడా హోదాపై అల్టిమేటం లేదన్నారు జగన్. తన ఎంపీలతో చంద్రబాబు రాజీనామాలు చేయించ కుండా ఉన్న నేపధ్యంలో మేము వాళ్లతో వెళ్లాలా.. అంటూ నిలదీశారు.

YS Jagan 7 Questions to CM Chandrababu


చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎలా సాగిందో అందరికీ తెలుసు కనీసం మాట్లాడటానికి ఎవరూ లరు..హేమా మాలినితో మాట్లాడారు నాలుగు ఫోటోలు దిగారు అంటూ ఎద్దేవా చేశారు..తన అవినీతి పై ఎక్కడ మోడీ విచారణ చేయిస్తారేమో అని చంద్రబాబు భయపడ్డారు అందుకే తమ ఎంపీలతో రాజీనామాలు చేయించలేదు అంటూ ఎద్దేవా చేశారు..చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.