మధుమేహం ఉన్నవారికి వ్యాయమ సూత్రాలు    2017-10-05   22:46:19  IST  Lakshmi P

మధుమేహం ఉన్నవారిలో వ్యాయామం కీలకమైన పాత్రను పోషిస్తుంది. వీరు వ్యాయామాన్ని పరిమితంగా చేయాలి. ఎక్కువగా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల కొన్ని రోజులు నిపుణుల సంరక్షణలో చేసి ఆ తర్వాత మీరే చేసుకోవచ్చు.

వ్యాయామం చేయటం వలన సంతోషాన్ని కలిగించే ఎండార్ఫిన్లు, సెరటోనిన్ వంటి రసాయనాల ఉత్పత్తి పెరుగుతుంది. కండరాలు పటిష్టంగా మారతాయి.అంతేకాక కణాలు ఇన్సులిన్ ను గ్రహించే శక్తి పెరుగుతుంది.

మధుమేహం వ్యాధి ఉన్నవారు పాదాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పాదాలకు సెట్ అయ్యే విధంగా పాదరక్షలను ఎంపిక చేసుకోవాలి.