షాప్ కీపర్ అడిగిన ప్రశ్నలకు ఆ నింబు మిర్చి పిల్లోడు ఇచ్చిన సమాధానాలు మనసును కదిలించాయి.!     2018-09-14   11:23:11  IST  Sainath G

ఉదయం 10 అవుతోంది. ముంబాయ్ నగర వీధులు చాలా బిజీబిజీగా మారిపోతున్నాయ్. అప్పుడే వచ్చిన షాప్ యజమాని తన షాప్ ను తెరిచి సమాన్లు సర్దుకుంటున్నాడు. అంతలోనే అక్కడికి వచ్చాడు ఓ పిల్లాడు. చేతిలో నిమ్మకాయలు, మిరపకాయలు పట్టుకొని సార్ దిష్టి యంత్రాలు కావాలా? అంటూ….. అతనిని ఎప్పటి నుండో గమనిస్తున్న ఆ షాప్ యజమాని బాబు ఇటురా..అని ఎప్పటి నుండో తాను అడగాలనుకున్న ప్రశ్నలను అడిగాడు…..దానికి ఆ పిల్లాడి చెప్పిన సమాధానాలు మదిని కరిగించాయ్. అతని ఆలోచనా స్థాయి, వాస్తవపరిస్థితులు కళ్లకు కట్టినట్టు కనబడతాయ్ అతని అమాయక సమాధానాల్లో…. షాప్ కీపర్: బాబు నీ వయసెంత?
పిల్లాడు: నాకు తెలియదు సార్..!
షా.కీ: నువ్వెక్కడుంటావ్.?
పి: ఇక్కడి నుండి 10 కి.మీ దూరంలో ఉండే స్లమ్ ఏరియాలో సార్.
షా.కీ: అంతదూరం నుండి ఇక్కడికి ఎందుకు రావడం?
పిల్లాడు: ఇక్కడైతే ఎక్కువ డబ్బులు దొరుకుతాయ్ సార్.
షా.కీ: ఎప్పుడూ ఇక్కడే కనబడతావ్..మరి రెస్ట్ ఎప్పుడు తీసుకుంటావ్?
పిల్లాడు: జ్వరం వచ్చినప్పుడు.

Shopkeeper,Telugu Moral Story,Young Nimbu Mirchi Hawker

షా.కీ:రోజూ ఎన్నగంటలకు వస్తావ్, ఎప్పటి వరకు ఉంటావ్?
పిల్లాడు:రోజూ 7 గంటలకు వస్తాను, తెచ్చిన సామాన్ అంతా అమ్ముడుపోయే వరకుంటాను, అప్పుడప్పుడు రాత్రి 9 అవుతుంది.
షా.కీ: మీ ఇంట్లో ఎవరెవరుంటారు.?
పిల్లాడు: అమ్మా, నాన్న, చెల్లి ,నేను.
షా.కీ: నాన్న ఏంచేస్తారు?
పిల్లాడు: ఆయన ఏం చేయరు. ఆయన మంచం మీదున్నారు. ఆయన 3యేళ్ల నుండి ఓ వ్యాధితో బాధపడుతున్నారు.
షా.కీ:నువ్వు స్కూల్ కు వెళతావా?
పిల్లాడు:లేదు , నేను స్కూల్ కు వెళితే మా ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు? కానీ నాకు స్కూల్ కు వెళ్లాలని చదువుకోవాలని చాలా ఉంటుంది. కానీ ఏం చేస్తాం.!
షా.కీ : పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నావ్?
పిల్లాడు:మా చెల్లిని మంచిగా చదివించి డాక్టర్ ను చేయాలి. అమ్మను కంటికిరెప్పాల చూచుకోవాలి, మా నాన్నను మంచి హాస్పిటల్ లో చూపించాలి. అంతే సార్….
షా.కీ : మరి నీకేం వద్దా?
పిల్లాడు: అమ్మా, నాన్న , చెల్లి..వీళ్లంతా ఉంది నాకోసమే కదా సార్!
షా.కీ: (కర్చీఫ్ తో కళ్లు తుడుచుకుంటున్నాడు.)
పిల్లాడు: ‘(మిర్చీ-నింబూ..దస్ కా ఏక్. అంటూ వేరే షాప్ వైపు వెళ్లాడు.)