పరగడుపున ఈ ఆహారాలను తీసుకుంటే అంతే సంగతులు...అవి ఏమిటో చూద్దాం  

ఏదైనా ఆహారాన్ని మితంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి సహాయపడుతుంది. అదే అతిగా తీసుకుంటే మాత్రం ఒక్కోసారి ప్రమాదం కావచ్చు. అయితే ఆహారాలను తీసుకొనే సమయాన్ని బట్టి కూడా ఉంటుంది. ఉదయం పరగడుపున కొన్ని ఆహారాలను తీసుకుంటే చాలా ప్రమాదం. వాటి గురించి తెలుసుకుందాం.

కారం ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే గ్యాస్ అల్సర్ లు వచ్చే ప్రమాదం ఉంది.

సాఫ్ట్ డ్రింక్స్ ఉదయం పరగడుపున తీసుకోకూడదు. సాఫ్య్ డ్రింక్స్ లో ఉండే కార్బొనేటెడ్ యాసిడ్స్ పొట్టలో గ్యాస్ సమస్యకు కారణం అవుతాయి.

కోల్డ్ డ్రింక్స్ లో ఎటువంటి పోషకాలు లేకుండా కేలరీలు తక్కువగా షుగర్ ఎక్కువగా ఉంటుంది. వీటికి బదులు తాజా పండ్ల రసాలు తీసుకుంటే మంచిది.

సిట్రస్ జాతికి చెందిన నిమ్మ,ఆరెంజ్ జామ వంటి పండ్లను ఉదయం పరగడుపున తింటే కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది

ఉదయం లేవగానే అందరు కాఫీ త్రాగుతూ ఉంటారు. ఉదయం కాఫీ త్రాగటం మంచిదే. కానీ పరగడుపున త్రాగకూడదు. ఒకవేళ పరగడుపున త్రాగితే హార్మోన్లు అన్ బ్యాలెన్స్ మరియు ఎసిడిటికి కారణం అవుతుంది. ఒక గ్లాస్ మంచి నీటిని త్రాగిన తర్వాత కాఫీ త్రాగటం మంచిది.

బేరి పండ్లను పరగడుపున తింటే గ్యాస్ సమస్యకు కారణం అవుతుంది.

అరటి పండును పరగడుపున తింటే అరటిపండులో ఉండే మెగ్నీషియం రక్తం లెవల్స్ మీద ప్రభావం చూపటం వలన గుండె ఆరోగ్యం మీద ప్రభావము ఉంటుంది.

టమోటాలో టానిన్ యాసిడ్స్ ఎక్కువగా ఉండుట వలన కడుపులో టిష్యు ల మీద ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల ఉదయం పరగడుపున ఇటువంటి ఆహారాలను ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు.