వైసీపీ ఎమ్మెల్యే సీటుపై పోసాని క‌న్ను.. ఆ నియోజగవర్గం ఎక్కడంటే     2018-04-14   01:49:59  IST  Bhanu C

ప్ర‌ముఖ విల‌క్ష‌ణ సినీన‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళీ కొద్ది రోజులుగా ఏపీలో అధికార టీడీపీ ప్ర‌భుత్వాన్ని, సీఎం చంద్ర‌బాబును టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు. చంద్ర‌బాబు మీద పోసాని ప‌గ‌బ‌ట్టిన‌ట్టుగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, ఆయ‌న కుమారుడు కేటీఆర్‌ను అటు చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు మంత్రి అయిన లోకేశ్‌ను పోలుస్తూ బాబు అండ్ లోకేశ్‌ను ఓ ఆటాడుకుంటున్నాడు. తాజాగా ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలోనూ కొంద‌రు సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లు చంద్ర‌బాబును క‌లిసి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంపై పోసాని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.


అశ్వనీదత్‌, కేఎల్‌ నారాయణ, రాఘవేంద్రరావు, కే నారాయణ, వెంకటేశ్వర్‌రావు, కిరణ్‌ తదితరులు చంద్రబాబును కలిసి చిత్ర పరిశ్రమ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ ప్రకటన చేసిన వార్త‌ల‌పై ఆయ‌న ఫైర్ అయ్యారు. వీరంతా సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రిని సంప్ర‌దించి ఈ మ‌ద్ద‌తు ఇచ్చారో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పోసాని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలు కూడా ఉద్యమాలు చేశాయని, వారి ఉద్యమానికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదని సినీ పెద్దలను నిలదీశారు. సీఎంకు ఇలా మద్దతు ఇవ్వడం కులం రంగు పులుముకుంటోందని కూడా పోసాని ఫైర్ అయ్యారు.