ఏ వారం.. ఏ పూజ... ఏ ఫలితం?     2018-04-13   03:44:17  IST  Raghu V

శివ పురాణం ప్రకారం మనకు ఉన్న ఏడు రోజుల్లో ఏ దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరంగా చెప్పారు. ఒక్కొక్కరికి ఒకొక్క ఇష్ట దైవం ఉంటుంది. వారు తమ ఇష్ట దైవానికి పూజ ఎలా చేయాలో అని ఆలోచనలో పడతారు. ఇప్పుడు ఏ వారంలో మీ ఇష్ట దైవాన్ని పూజించాలో తెలుసుకుందాం. అలాగే పూజించటం వలన కలిగే అద్భుతమైన ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం.

ఆదివారం
ఆదివారం సూర్యుణ్ణి పూజించాలి. సూర్యుణ్ణి పుజిసిన్హాటం వలన తలకు సంబందించిన సమస్యలు తొలగిపోతాయి. ఇలా ఒక సంవత్సరం పాటు ఆదివారం సూర్యుణ్ణి పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. అప్పుడు సూర్యుని అనుగ్రహం కలుగుతుంది.


సోమవారం
సంపద కావాలని కోరుకునేవారు సోమవారం లక్ష్మీదేవిని పూజించి వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి. అప్పుడు కోరుకున్న కోరిక నెరవేరుతుంది.

మంగళవారం
ఏమైనా వ్యాధులు ఉంటే మంగళవారం కాళీదేవతను పూజించి వేద పండితులకు మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో భోజనం పెట్టాలి.