బియ్యం గింజ కంటే చిన్న కంప్యూటర్‌ మీరెప్పుడైనా చూశారా? ప్రపంచంలోనే అత్యంత చిన్న కంప్యూటర్ ఇదే.!     2018-06-23   22:56:00  IST  Raghu V

కంప్యూటర్‌ బరువు.. 50 టన్నులు. ఆక్రమించిన స్థలం 1800 చదరపు అడుగులు. మొదట్లో కంప్యూటర్ అలాగే ఉండేది. ఇప్పుడు కాలం మారింది. నానో టెక్నాలజీ తరం వచ్చింది. వేళ్ల సందుల్లో దాచిపెట్టగలిగే అతి చిన్న కంప్యూటర్‌ ఆవిష్కృతమైంది. బియ్యం గింజ కంటే చిన్న కంప్యూటర్‌ మీరెప్పుడైనా చూశారా? అయితే అమెరికాలోని మిచిగాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ప్రపంచంలో అత్యంత చిన్న కంప్యూటర్‌ను మీరు చూడాల్సిందేనట.

బియ్యపు గింజ కంటే చిన్నగా.. 0.3 మిల్లీమీటర్ల పొడవుతో.. ఇంతకుముందు తయారు చేసిన ‘మిచిగాన్‌ మైక్రో మోట్‌(2x2x4)’ కంటే చిన్న పరిమాణంలో ఉంది. ఈ కొత్త మైక్రో కంప్యూటర్‌లో ర్యామ్‌, ఫొటోవొల్టాయిక్స్‌, ప్రాసెసర్లు, వైర్‌లెస్‌ ట్రాన్స్‌మిటర్‌, రిసీవర్లు ఉంటాయి. ఇందులో ఉండే చిన్న బల్బుతో డేటా బదిలీ జరుగుతుందని దీన్ని రూపొందించిన పరిశోధకుడు డేవిడ్‌ బ్రావూ తెలిపారు.