World’s most weird naked TV show starts again

మన దేశంలో రియాలిటి షోల గురించి మాట్లాడుకుంటే కౌన్ బనేగా కరోడ్ పతి (మీలో ఎవరు కోటీశ్వరుడు), బిగ్ బాస్, డ్యాన్స్ షోలు, ఫియర్ ఫాక్టర్ .. ఇలా కొన్ని రకాల షోలు మాత్రమే ఉంటాయి. మనవారికి క్రియేటివిటి లేక కాదు, సెన్సారు ఇబ్బందుల వలన విపరీతమైన ఆలోచనలు తీసుకురావట్లేదు. కాని ఇంగ్లీష్ దేశాల్లో అలాంటి ఇబ్బందులే ఉండవు. టీవి సీరియల్లు కూడా హింస, నగ్నత్వంతో నిండి ఉంటాయి. బూతు ఉంది కదా అని డైలాగులు బీప్ చేయరు. ఇష్టం ఉన్న ఆలోచనతో రావొచ్చు, ఇష్టం ఉన్నట్లుగా తీయొచ్చు. కాని అలాంటి ఇంగ్లీష్ వారు కూడా తమ అభ్యంతరాలు వ్యక్తం చేసిన షో ఒకటి ఉంది. ఇక మీరే అర్థం చేసుకోండి అది ఎంత సంచలనాత్మకంగా ఉంటుందో.

ఆ షో పేరే Naked Attraction. అల్రెడి ఒక సీజన్ కంప్లీట్ చేసుకున్న ఈ షో, రెండో సీజన్ లోకి అడుగుపెడుతోంది. ఈ వింత షో కాన్సెప్ట్ చాలా వింతగా ఉంటుంది. ఇందులో పార్టిసిపేట్ చేసేవారంతా నగ్నంగానే ఉంటారు. స్త్రీ, పురుషులు తేడా లేకుండా కంటెస్టెంట్స్ అంతా నగ్నంగానే ఉండాలి. ఇందుకో తమ పార్టనర్ ని ఎంచుకోవాలి. వారి ఒకేసారి పూర్తిగా చూపించరు అంట. ఒక్కోభాగం ఒకసారి రివీల్ చేస్తారట. మొత్తానికి అలా నగ్న అవతారలను చూసే పార్టనర్ ని ఎంచుకున్న తరువాత ఒకేసారి పూర్తి నగ్నంగా దర్శనమిస్తారు. అలా ఓ జంట కుదిరాక వారు డేట్ కి వెళ్ళాలి. అయతే డేట్ లో బట్టలు వేసుకుంటారండోయ్. వారి డేట్ పూర్తయిన తరువాత వారి అనుభవాల్ని రివ్యూ చేస్తారు. ఇదన్నమాట కథ.

కొత్తగా ఉన్నా చెత్తగా ఉందని అంటున్నారు అంతా. కేవలం భారతీయులే కాదు, బ్రటిష్ వారు కూడా ఈ షో ఆపేయండిరా బాబు అంటూ మొత్తుకుంటున్నారు. కాని ఛానెల్ 6 వారు అవేవి పట్టించుకోకుండా రెండో సీజన్ మొదలుపెట్టారు. ఈసారి పైత్యం ఇంకా పెరిగింది. వచ్చే సీజన్స్ లో ఇంకా వల్గర్ గా దీన్ని మారుస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు నిర్వాహకులు.

అక్కడంతే అండి. మనలాగా సినిమా, టీవి మీద ఇన్ని నిబంధనలు, సెన్సార్ కత్తెర్లు ఉండవు. పేరుకే డేటింగ్ షో ఇది. కాని పోర్న్ కి ఏమాత్రం తీసిపోనట్లుగా తయారయ్యింది. మరి ఇలాంటి షోని జనాలు నలుగురితో చూడలేరు కదా, టీఆర్పీ రావట్లేదేమో అనుకుంటున్నారా? ఆ నలుగురు చూస్తారు .. కలిసి కాదు, ఒంటరిగా. ఈ షోకి బ్రహ్మాండమైన టీఆర్పీ వస్తోంది.