అమ్మాయలకు అప్పటినుంచే శృంగారం మీద ఆసక్తి తగ్గిపోతుందట  

శృంగారం మీద అనాసక్తి అనేది చిన్న విషయం కాదు‌. ఎందుకంటే మనిషి శరీరానికి దొరకాల్సిన అత్యవసర అనుభవాల్లో శృంగారం అనేది ప్రధానమైనది‌. ఆ అనుభవం తగ్గాలని, ఆ అనుభూతిని పొందడాన్ని మానేయ్యాలని ఎవరు కోరుకోరు‌‌. సరైన అనుభవం దొరక్క అనాసక్తి పుడుతుంది అంతే. మరి అనాసక్తి స్త్రీ, పురుషులలో ఎవరికి ముందు పుడుతుంది? ఎప్పుడు పుడుతుంది? ఎలా పుడుతుంది? ఈ విషయం మీద కాస్మాపాలిటన్ ఓ సర్వే చేపట్టింది. ఫలితాలు ఇలా ఉన్నాయి.

సర్వేలో 5000 మంది స్త్రీలు 3000 మంది పురుషులు పాల్గొన్నారు. ఇందులో 47 శాతం మంది స్త్రీలు పెళ్లి జరిగిన ఒక సంవత్సరానికి శృంగారం మీద అనాసక్తికరంగా అనిపించడం మొదలవుతుందని చెప్పుకొచ్చారు. 23 శాతం మంది రెండు సంవత్సరాలకు అనాసక్తి పడుతుందని చెప్పారు. 21 శాతం మంది ఐదారేళ్ల సమయంలో శృంగారం మీద ఆసక్తి తగ్గుతుందని చెప్పారు కేవలం 9 శాతం మంది తమకు ఇప్పటి వరకు కూడా శృంగారం మీద అనాసక్తి కలగలేదని చెప్పారు. సర్వేలో పాల్గొన్న స్త్రీలంతా కూడా 30 ఏళ్లకు పైగా వయస్సు నిండిన వారే కావడం గమనార్హం. అంటే అందరికీ కూడా శృంగారం అనుభవం దొరికింది అన్నమాట.