ఆ పూట శృంగారం అంటేనే ఎక్కువ ఇష్టం అంట అమ్మాయిలకు     2018-03-24   06:30:41  IST  Raghu V

Women prefer this time the most for $ex – study

శృంగారం కి సమయం సందర్భం అక్కరలేదు అని అంటారు. నిజమే మరి, ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడే పని కానియ్యాలి. కామోద్రేకం ఎప్పుడు కలిగితే అప్పుడే కోరిక తీర్చుకోవాలి భాగస్వాములు. కాని అన్నిపనులకి ఓ మంచి సమయం ఉన్నట్లే, శృంగారం కి కూడా ఓ మంచి సమయం ఉంటుందట. ఆ సమయంలో శృంగారం కొంచెం ఎక్కువ కిక్ నే ఇస్తుందట. మరి ఆ అప్పుడు, ఎప్పుడో చూడండి.

జర్నల్ ఆఫ్ సెక్సాలాజీ సంస్థ వారు, క్వీన్స్ లాండ్ లో ఈ మధ్యే ఓ సర్వే చేసారు. 450 అమ్మాయిలను పిలిపించారు. వాళ్ళందరిని రెండు ప్రశ్నలు అడిగారు. ఒకటి, మీరు శృంగారం ఎప్పుడు చేయడానికి ఇష్టపడతారు అని, రెండు శృంగారం ఎక్కువగా ఏ సమయంలో చేస్తున్నారు అని. మొదటి ప్రశ్నకి ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. 53% మంది స్త్రీలు ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయ్యి శృంగారం చేయడాన్ని ఇష్టపడతారట. 44% మంది రాత్రిపూటకి ఓటు వేసారు. మిగితా ఓట్లు మిగితా సమయాలకి పడ్డాయి.

ఇక రెండొవ ప్రశ్న .. ఎక్కువగా శృంగారం చేసే సమయం ఏది అని. ఈ ప్రశ్నకి మాత్రం మనం ఊహించే సమాధానమే ఎదురయ్యింది. 87% మంది రాత్రిపూటే శృంగారిస్తున్నారట. మిగితావారు మిగితా సమయాల్లో శృంగారం ఎక్కువగా చేస్తున్నారట. ఈ ఫలితాలు మనల్ని ఆశ్చర్యపరచవచ్చు కాని, పరిశోధకులని ఆశ్చర్యపరచలేదు. దానికి కారణం, వారికి ఉదయంపూట శృంగారం ఎందుకు మేలో, ఆ పూట శృంగారం ని అమ్మాయిలు ఎందుకు కోరుకుంటున్నారో తెలీడమే.

ఉదయంపూట మగవారిలో టెస్టోస్టిరోన్ హార్మోన్ లెవల్స్ ఎక్కువ ఉంటాయి. దాంతో అంగస్తంభన సమస్యలు పెద్దగా ఉండవు. అదే రాత్రపూట ఇలాంటి సమస్యలు ఎదురుకావచ్చు. అలాగే ఉదయం పూట మహిళల శరీరం కూడా శృంగారానికి మరింత సహకరిస్తుంది. అదే రాత్రి అయితే రోజంతా అలసిపోయిన శరీరంతో వంద శాతం పెర్ఫార్మెన్స్ కష్టం అయిపోతుంది. విశ్రాంతి తరువాత చేసే శృంగారం చాలా బలంగా ఉంటుందట. అందుకే, ఈ సమయంలో శృంగార ఎక్కువ కావాలని క్వీన్స్ లాండ్ అమ్మాయిలు కోరుకుంటున్నా, గజిబిజి జీవితంలో, శృంగారం అనేది కేవలం రాత్రిపూట ఆడే ఆట అయిపోయింది.