Women can walk naked at their will – says this actress

బ్రిటిష్ అందం ఆమీ జాక్సన్ ఈమధ్య మీడియాలో సందడి చేయడం లేదు. సినిమాలు మరీ ఎక్కువగా చేతిలో లేవుగా, అందుకే ఆ దేశం, ఈ దేశం తిరుగుతోంది. ఫోటోషూట్స్ కూడా ఎక్కువగా చేయడం లేదు. మనిషి ఇలా ఖాలిగా ఉన్నప్పుడే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఆలానే ఆమీ జాక్సన్ కి ఒక ఆలోచన వచ్చింది. వ్యాపారం చేయాలనే ఆలోచన. అది కూడా బట్టల వ్యాపారం. బట్టల వ్యాపారం అంటే జీన్స్, టీషర్ట్స్ వ్యాపారం కాదు, బికినీల వ్యాపారం. ఆమీకి ఈ మధ్య ఒక బీచ్ కి వెళదాం అనుకున్నప్పుడు సరైన బికినీ దొరకలేదట. తనకు నచ్చే బికినీ కోసం ఊరంతా వెతికినా, అసంతృప్తే మిగిలిందట. అందుకే తానే సొంతంగా బికినీల బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇలా కష్టపడాల్సిన అవసరం ఉండదు కదా అని అమీ బుర్రలోకి ఓ ఆలోచన వచ్చింది. అంతే, త్వరలోనే బికినీల కంపెనీ స్టార్ట్ చేస్తా అంటోంది.

ఈ బిజినెస్ ప్లాన్ తో ఒక ఘాటైన స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఆమీ. మంచి బట్టలు వేసుకోవడాన్ని మహిళలు ఇష్టపడతారని, వారికి మంచి బికినీలు అందిస్తానని, బికినీ వేసుకోవడం మహిళ ఇష్టమని, అసలు ఎలాంటి బట్టలు వేసుకోకపోవడం కూడా మహిళ ఇష్టమేనని, మనం మనకోసమే బట్టలు వేసుకోవాలి తప్ప, ఇతరుల కోసం కాదని, ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు ఉండాలని, అందుకే బికినీలు డిజైన్ చేయిస్తానని చెప్పింది ఆమీ.

హీరోయిన్ కంపెనీ కాబట్టి ఈ బికినీల ధరలు టూ మచ్ గా ఉంటాయేమో అనుకునేరు. అందరికి అందుబాటులో ఉండే ధరల్లోనే తన కంపెనీ ప్రాడక్ట్స్ ఉంటాయని ఆమీ చెప్పింది. ఇక సినిమాల విషయానికి వస్తే, ఈ ఫారెన్ బ్యూటి సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన రోబో సీక్వెల్ 2.0 లో నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్, వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.