Women Addicted to Porn unable to enjoy $ex life – study

బొత్తిగా శృంగారం అంటే ఏమిటో తెలియని వయసులో దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఆసక్తి, కుతూహలంతో పోర్న్ చూడటం మొదలుపెడతారు టీనేజర్స్. మెల్లిగా అదో అలవాటు అయిపోతుంది, జాబ్ వస్తే అదో రిలీఫ్ అయిపోతుంది. ఇలాంటి వారితో ఎలాంటి ఇబ్బంది లేదు కాని కొందరు దానికి బానిసలైపోతారు. అక్కడే మానసిక సమస్యలు మొదలయ్యేవి. పోర్న్ అడిక్షన్ అనేది ఈ జెనరేషన్ లో ఉన్న అతిపెద్ద మానసిక సమస్యల్లో ఒకటి. దీన్ని మానసిక సమస్య అని ఎందుకు అనాలంటే, ఇది శృంగారం మీద ఎక్కడలేని అంచనాలు పెంచేసి, ఆ ప్రపంచంలోనే బ్రతికేలా చేస్తుంది. దీని వలన వేల దంపతులు ఇబ్బందిపడుతున్నారు.

అచ్చం పోర్న్ లాంటి చర్యలే తమ బెడ్ రూమ్స్ లో జరగాలని కోరుకుంటారు. ఓ ఊహలో బ్రతికేస్తుంటారు. పోర్న్ స్టార్స్ చేసే జిమ్ముక్కులని నమ్ముతూ, నిజానికి, విడియో కోసం చేసిన హంగులకి తేడా కనిపెట్టలేకపోతారు. అయితే పోర్న్ బానిసలుగా కేవలం మగవారే మారుతున్నారు అనే అపోహ ఒకటి ఉంది. సహజంగా మగవారు ఎక్కువగా బయటపడతారు కాబట్టి ఇలాంటి అపోహ ఉండటం అంతే సహజం. అందుకే కెనడాలో ఓ సర్వే చేసారు. పోర్న్ అతిగా చూసే మహిళలను బెడ్ రూమ్ లో సంతృప్తిపరచడం చాలా కష్టమైన విషయమని, ఓరకంగా అసాధ్యమని సర్వే రిజల్ట్స్ చెప్పాయి.