“2019 ఎన్నికల్లో” చంద్రబాబు “విజయం తధ్యం”..ఎలా అంటే     2018-04-03   00:12:58  IST  Bhanu C

తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు మార్పులు వేగంగా మారుతున్నాయి..ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో…ఒంటరి పోరు చేస్తారో ఇప్పటికే ఒక అవగాహనకి వచ్చేశారు..ముఖ్యంగా ఏపీ రాజకీయాలలో మాత్రం ఎవరు ఎవరితో ముందుకు వెళ్ళాలి అనే విషయంలో ఎంతో క్లారిటీ తో ఉంటున్నారట..ఈ విషయంపైనే ఏపీ రాజకీయాలలో చర్చ కొనసాగుతోంది..అయితే, తాజా సమాచారం ప్రకారం దాదాపు అన్ని పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటమే చేస్తాయని తెలుస్తోంది..

2014 ఎన్నికల్లో మిత్ర పక్షాలుగా ఉన్న బీజేపీ-టీడీపీల‌ భంధం చెడిపోయిన నేపధ్యంలో మళ్ళీ వీరు కలిసే పరిస్థితి లేదు..ఇక‌ ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటి సారిగా పోటీ చేయబోతున్న జనసేన పార్టీ చంద్రబాబు తో జట్టు కడుతుందా లేక వామపక్షాలు తోడు అవుతాయా అంటే చెప్పలేని పరిస్థితి…పైగా పవన్ తాజా కామెంట్స్ తో చంద్రబాబుతో సయోధ్య కష్టమనే చెప్పాలి…అయితే జగన్ పవన్ కూడా కలిసే పరిస్థితులు ఎక్కడా కనిపిచడం లేదు..మరో వైపు బీజేపీ-జ‌గ‌న్ ఏమ‌న్నా పొత్తు పెట్టుకుంటాయా..అంటే జగన్ ఆ సాహసం చేయదు ఎందుకంటే ఇప్పటికే బీజేపి ఏపీకి చేసిన అన్యాయం వలన ఏపీలో బీజేపి పెద్ద విలన్ అయ్యింది..ప్రజలు బీజేపి పేరు చెప్తేనే మండి పడుతున్నారు.ఇలాంటి సమయంలో జగన్ బీజేపి పొత్తుకి తెరతీస్తే తప్పకుండా దెబ్బతింటాడు..సో జగన్ ,బిజెపి పొత్తు సైతం లేనట్టే..ఇక కాంగ్రెస్ ఊసులోకే లేదు..దానితో ఎవరు కలవను కూడా కలవరు..

Will Chandra Babu Naidu win 2019 elections in AP


అయితే ఈ పరిస్థితులని బట్టి చుస్తే అన్ని పార్టీలు ఈ సారి ఎన్నికల్లో ఒంటరి పోరునే జరుపనున్నాయి..అయితే ఇప్పుడు ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతాయి ఎలాగో బీజేపి ,కాంగ్రెస్ పార్టీలు చావు దెబ్బ తినక మానవు..ఆ రెండు పార్టీలని పక్కన పెట్టి చూస్తె.. ముందుగా పవన్ కళ్యాణ్ జనసేన విషయానికి వస్తే పవన్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో..ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో..ఒక విషయంపై ఈరోజు స్పందిస్తే మళ్ళీ ఆ ఊసే లేదు..ఏపీలో ఉన్న ప్రజలలో ఇదే తరహా కన్ఫ్యూజ్ 75 శాతం మంది ప్రజలకి ఉంది..ఒక సారి జగన్ చీటర్ అంటాడు..జగన్ తో జట్టు కట్టే ప్రయత్నాలు చేస్తాడు..మరో మారు చంద్రబాబు అంత అనుభవజ్ఞులైన వ్యక్తి ఎవరు లేరు అంటూనే చంద్రబాబు అవినీతి పరుడు అంటూ విమర్సలు చేస్తూ ఉంటారు..ఇలాంటి గోడమీద పిల్లి లాంటి పార్టీ పై ప్రజలు ఏ మాత్రం నమ్మకం పెట్టుకోరు.