భర్తపై కేసు పెట్టిన భార్య.! కారణం అతను ఆమెతో చేసిన శృంగారం.! ట్విస్ట్ ఏంటంటే.?  

పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో శారీరకంగా కలిసేందుకు భార్య అన్ని వేళాల సిద్ధంగా ఉండాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. భార్యతో బలవంతంగా శృంగారం చేయాల్సిన అవసరం లేదని కూడా ధర్మాసనం తెలిపింది. వివాహం చేసుకున్నాక భార్యాభర్తలిద్దరికీ శృంగారానికి ఇష్టం లేదని చెప్పే హక్కు ఉంటుందని జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా అసహజ సెక్స్‌తో భర్త వేధిస్తున్నాడని ఓ భార్య ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించింది. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.!

బాధిత మహిళకి 2014లో డాక్టరుతో వివాహం జరిగింది. అప్పటి నుంచి తన భర్త తరచూ అసహజ సెక్స్‌లో పాల్గొనాలంటూ వేధిస్తున్నాడని ఆమె ఇటీవల పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ కేసుని కొట్టివేయాలంటూ గుజరాత్‌ కోర్టుని భర్త ఆశ్రయించగా.. ఆమె ఫిర్యాదుని గుజరాత్ కోర్టు విచారణకి తిరస్కరించింది.

గుజరాత్ కోర్టులో తనకి చుక్కెదురు కావడంతో.. బాధితురాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. తన భర్తకి సెక్స్ సామర్థం లేదని.. అందుకే ఈ విధంగా అసహజ సెక్స్‌లో పాల్గొనాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు పిటీషన్‌‌లో వెల్లడించింది. అసహజ సెక్స్ అనేది.. సెక్షన్‌ 377 ప్రకారం నేరం కిందకే వస్తుందని వ్యాఖ్యానించిన సర్వోన్నత న్యాయస్థానం భర్తకి నోటీసులు జారీ చేసింది.