బ్రా సైజ్ కరెక్టుగా ఉండాలి అమ్మాయిలు..లేదంటే ఇన్ని కష్టాలు

ఆధునిక యుగంలో స్త్రీల ఒంటిమీదకి కొత్తగా వచ్చిన వస్త్రం బ్రా. వక్షోజాలు వదులుగా మారకుండా, ట్రాన్స్ పరెంట్ బట్టలు చేసుకున్నప్పుడు లోభాగం కనిపించకుండా చేస్తుంది బ్రా. ఇవి లోదుస్తులు కావడంతో, దీని సైజు బయటకి చెప్పేందుకు ఇబ్బందిపడతారు అమ్మాయిల. ఒక్కోసారి తప్పు సైజు బ్రా కొనేస్తారు. అలా చేయడం మంచిది కాదు. బ్రా సైజు ఎప్పుడు కరెక్టుగానే ఉండాలి. అటు వదులుగా ఉండకూడదు, ఇటు మరీ టైట్ గా కూడా మారకూడదు. ఒకవేళ కరెక్టు సైజు బ్రా వాడలేదనుకోండి .. ఏం జరుగుతుందో తెలుసా?

* బ్రా టైట్ గా మారితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అవసరమైన ఆక్సిజన్ లెవెల్స్ అందవు. బ్లడ్ సర్కులేషన్‌ మీద కూడా టైట్ బ్రాలు నెగెటివ్ ప్రభావం చూపుతాయి. ఎముకల మీద ఒత్తిడి పెరుగుతుంది.

* మహిళలు వేసుకునే బ్రా కూడా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందట. సైజుకి సరిపోని బ్రా జీర్ణక్రియని నెమ్మదింపజేస్తుందట.