అర్జునా-ఫాల్గుణా అంటే ఏమిటి? పిడుగు పడితే ఎందుకు జపించాలి? Devotional Bhakthi Songs Programs

ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది ‌. తెలుగు రాష్ట్రాల నలుమూలలా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ లో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. పిడుగులు పడి చనిపోయిన వారి గురించి కూడా మనం పేపర్ లో చదువుకుంటున్నాం. పిడుగు శబ్దం మనుషులని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇలాంటి సమయంలో అర్జునా ఫాల్గుణా అంటూ అర్జునుడి నామాలను జపించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు ఫాల్గుణ అనే నామానికి అర్థం ఏమిటి? పిడుగులు పడుతున్నప్పుడు ఎందుకు జపించాలి? మీకు జవాబు చెప్పే ముందు వచ్చిన కథ చెప్పాలి.

పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో విరాట మహారాజు కొలువులో పలురకాల వృత్తిలో ఉంటూ అక్కడే బస చేశారని మీకు తెలిసినదే. అర్జునుడు విరాట మహారాజు కూతురికి నాట్య శిక్షకుడిగా వ్యవహరిస్తూ తన పేరుని బృహన్నలగా చెప్పుకుంటాడు. పాండవులు ఎక్కడ ఉన్నది తెలుసుకున్న కౌరవులు వారి అజ్ఞాతవాసాన్ని భంగం చేసేందుకు విరాటరాజు రాజ్యంపై దాడికి దిగుతారు. అప్పుడు అర్జునుడు రాజకుమారుడైన ఉత్తరకుమారుడి రథానికి రథసారధిగా వ్యవహరిస్తాడు. అయితే కౌరవులు లక్షల్లో ఉండటంతో వారి భారీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు.