వేసవి తాపాన్ని తగ్గించే అద్భుతమైన సంజీవిని కీరా దోస     2018-05-09   22:37:32  IST  Lakshmi P

వేసవికాలం ఎండలతో బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. అయితే కొన్ని పనులకు తప్పనిసరిగా బయటకు వెళ్లక తప్పదు. ఇలా బయటకు వెళ్ళినప్పుడు వచ్చే వేసవి తాపాన్ని తగ్గించుకోవటానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. వేసవితాపానికి చెక్ పెట్టాలంటే కీరదోస ముక్కలను తినాలి. కీరదోస వేసవి తాపాన్ని తగ్గించటమే కాకుండా శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రతి రోజు క్రమం తప్పకుండా కీరదోస ముక్కలను తింటూ ఉంటే శరీరంలో మలినాలు తొలగిపోయి బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారికి మంచిది.

రాత్రి పడుకొనే ముందు కొన్ని కీరదోస ముక్కలను తింటే ఉదయం లేవగానే వచ్చే తలనొప్పి తగ్గిపోతుంది. అంతేకాక హ్యాంగోవర్ కూడా ఉండదు.