శృంగారం తరువాత మూత్ర విసర్జన చేయాలా.?     2018-04-07   22:46:08  IST  Raghu V

గమనించి ఉంటారు, శృంగారం పూర్తయిన తరువాత కాని, హస్తప్రయోగం చేసుకున్న తరువాత కాని, మూత్ర విసర్జన చేయాలి అనిపిస్తుంది. ఒక్కోసారి మూత్రం దానంతట అదే వస్తుంది. స్త్రీలలో అయితే మూత్ర విసర్జన జరగటం ఇంకా ఎక్కువ. మరి $ex తరువాత మూత్ర విసర్జన చేయడం కరెక్టేనా అంటే ముమ్మాటికి కరెక్టే.

* ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరమైమ విషయం. శృంగారం సమయంలో జరిగే రాపిడి వలన ఒకరి శరీరంలోంచి మరొకరి శరీరంలోకి కొన్నిరకాల బ్యాక్టీరియా పదార్థాలు వెళ్ళవచ్చు. మూత్రం వాటిని బయటకి తీసుకువస్తుంది.

* కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు యురెత్రాలోకి వెళితే ఇంఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు మూత్రమే సహాయం చేసేది.

Why should one urinate after $ex?


* మహిళలు యూరినరి ట్రాక్ ఇంఫెక్షన్ కి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శృంగారం తరువాత మూత్ర విసర్జన చేస్తే ఇలాంటి యూటిఐ ఇంఫెక్షన్స్ ని దూరం పెట్టవచ్చు.

* శృంగారం తరువాత మూత్ర విసర్జన చేస్తే మలీనాలు, మైక్రోబ్స్ బ్లాడర్ లోకి, కిడ్నీల్లోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు.

* మూత్ర విసర్జన మీ ఆరోగ్యాన్ని తెలుపుతుంది. శృంగారం తరువాత కాని, శృంగారం తరువాత కొన్ని గంటల్లో కాని, మూత్రం రంగులో తేడా కనిపిస్తే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా డాక్టర్ దగ్గరకి వెళ్ళండి.

* శృంగారం తరువాత మూత్ర విసర్జన చేయడం ఒక హైజీనిక్ హ్యాబిట్ గా చెబుతారు సెక్సాలాజిస్టులు. సాధ్యమైనంతవరకు, కనీసం చిన్నిపాటి ఇంఫెక్షన్స్ నుంచైనా మనల్ని కాపాడుతుంది ఈ అలవాటు. అలాగే కండోమ్ వాడినా సరే, మూత్ర విసర్జన చేయడం మర్చిపోవద్దు.