జూన్ 21వ తేదీనే అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం ఎందుకు నిర్వ‌హిస్తున్నారో తెలుసా..?     2018-06-20   23:07:53  IST  Raghu V

జూన్ 21. అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం. 2015వ సంవ‌త్స‌రం నుంచి దీన్ని నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా 150కి పైగా దేశాల్లో ఉన్న ప్ర‌జ‌లు యోగా డేలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో ఈ సారి కూడా దీన్ని అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, సినీ తారలు, వాళ్లు, వీళ్లు అని తేడా లేకుండా జ‌నాలంద‌రూ యోగా డేలో పాల్గొని త‌మకు వ‌చ్చిన యోగాస‌నాలు వేశారు. అయితే మీకు తెలుసా..? జూన్ 21వ తేదీనే యోగా డేగా ఎందుకు నిర్ణ‌యించారో..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

ఏడాదిలో ఉండే 365 రోజుల్లోనూ జూన్ 21వ తేదీకి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అదేమిటంటే… ఈ రోజున స‌హ‌జంగానే ప‌గ‌టి స‌మ‌యం ఎక్కువ‌. ఎందుకంటే ఇదే రోజున ద‌క్షిణాయ‌నం ప్ర‌వేశిస్తుంది. ఇదే రోజున శివుడు (ఆదిగురువు, ఆది యోగి) యోగా గురించిన విజ్ఞానాన్ని దేవ‌త‌ల‌కు చెప్పాడ‌ట‌. ఇక ఈ రోజు నుంచి యోగాతోపాటు ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌కు అనుకూలంగా ఉంటుంద‌ట‌. ఈ క్ర‌మంలో జూన్ 21వ తేదీని వీటికి ఆరంభంగా భావిస్తారు. అందుకే ప్ర‌ధాని మోడీ ఈ అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ 27 సెప్టెంబ‌ర్‌ 2014వ తేదీన ఐక్య‌రాజ్య స‌మితి స‌మావేశంలో ప్ర‌సంగించారు.