జగన్ జైలుకి వెళ్ళబోతున్నాడా .... ఇదేం ట్విస్ట్ .     2018-08-14   12:03:16  IST  Sai M

ఏపీ మరో రాజకీయ సంచలనం జరిగే అవకాశాలు కనబడుతున్నట్టు నేషనల్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ భార్య వైఎస్ భారతి పేరు కూడా ఛార్జ్ షీట్ లో ఈడీ అధికారులు ఎక్కించిన కొద్ది రోజుల్లోనే అదే కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ తో పాటు మరికొంతమంది బడా పారిశ్రామికవేత్తలను జైలుకి పంపబోతున్నట్టు నేషనల్ మీడియా లో కధనాలు వస్తున్నాయి. జగన్ ని జెయిల్ కి పంపటం ద్వారా అవినీతి ఎవరు చేసినా ఉపేక్షించం అని, అవినీతి రహిత భారత్ కోసం తమ పోరాటం సాగుతుందని ప్రచారం చేసుకోవచ్చని బీజేపీ ఆలోచన గా ఉందని ఆ వార్త ఛానెల్ కథనం సారాంశం.

ED Charge Sheet On YS Bharathi,Why ED Wants To Put YS Jagan In To Jail,ys Jagan,Ysrcp

గత కొంతకాలంగా… తన కేసుల విచారణలో జాప్యం జరిగేవిధంగా జగన్‌ బిజెపి పెద్దలతో చెప్పించుకున్నా ఇప్పుడు బిజెపి పెద్దలు మనస్సు మార్చుకున్నారనే మాటలు ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్‌ పై ఉన్న కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం జగన్‌ కోర్టు వాయిదాలకు వెళ్లి వస్తున్నారని, ఇప్పటిదాకా దాదాపు 200 వారాల పాటు ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లారని కథనం లో చెప్పుకొచ్చింది.

పాదయాత్ర ఈ కేసుల్లో డిఫెన్స్‌ వాదనలు పూర్తి అయిపోయాయి. సీబీఐ కోర్టులో ఇక సీబీఐ తాను నమోదు చేసిన ఛార్జిషీటులపై వాదనలను వినిపించనుంది. ఇది మహా అయితే నెల రోజుల పాటు సాగవచ్చు. తరువాత సీబీఐ కోర్టు తన తీర్పును వెలువరించవచ్చు. జగన్‌ కేసుల్లో దాదాపు అన్నింటికి సాక్ష్యాలు ఉన్నాయి పైగా వాటి ఆధారాలన్ని సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ పక్కా సంపాదించి పెట్టారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఉన్న సీబీఐ అధికారులు దాన్ని ఫాలో అవుతున్నారని, దాదాపు మరో రెండు నెలలోపు జగన్‌ కేసుల్లో తొలి తీర్పు వచ్చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది.

ED Charge Sheet On YS Bharathi,Why ED Wants To Put YS Jagan In To Jail,ys Jagan,Ysrcp

బీజేపీతో సన్నిహితంగా మెలిగితే తన కేసుల్లో కొంచెం రిలీఫ్ దొరుకుతుందనే జగన్ ఇప్పటివరకు ఆలోచించాడని కానీ వైఎస్ భారతి పేరు కూడా కేసులోకి ఎక్కడంతో జగన్ డైలమాలో పడినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగానే.. ఏపీ లో టీడీపీ ని ఓడించాలంటే జగన్ జైలు లో ఉంటేనే బెటర్ అని ఆ సానుభూతితో అయినా వైసీపీ గెలిచే అవకాశం ఉంటుందని దాని ఆ తరువాత తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని బీజేపీ నేతల ఆలోచనగా ఆ కధనం లో ప్రచారం చేశారు. ఆ మీద కధనం ప్రకారం మరో రెండు మూడు నెలల్లో జగన్ జైలుకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అదే కనుక జరిగితే ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనమే అవుతుంది.