కరుణానిధి నల్ల కళ్లద్దాల వెనుక ఉన్న కారణం ఇదే  

గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాదపడుతున్న కరుణానిధి కన్నుమూసారు.కరుణ మృతితో తమిళనాడు కన్నీరు మున్నీరవుతుంది.సుమారు 50 ఏళ్లపాటు డిఎంకె పార్టిని ముందుండి నడిపిన రధసారధి కరుణానిధి..ఐదు సార్లు ముఖ్యమంత్రిగా నియామకం,పదమూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక,మంచి రచయిత ఇలా బహుముఖ ప్రజ్ణాశాలి కరుణానిధి. కరుణానిది అనే పేరు స్పురణకు రాగానే ముందుగా మన కళ్లముందు మెదిలేది నల్లకళ్లద్దాల మనిషి..ఈ అద్దాల వెనుక ఒక కథ ఉంది.

ఒక ప్రమాదంలో కంటికి దెబ్బ తగలడంతో ఆ గాయం కనపడకూడదనే నల్ల కళ్లద్దాలు వాడేవారట కరుణానిధి.ప్రమాదం తర్వాత అమెరికాలో సర్జరి చేయించుకున్నారు..ఆ తర్వాత 1971 నుంచి నల్ల కళ్లద్దాలను ధరిస్తున్నారు.అలా కొన్నేళ్ల నుండి పెద్దగా ఉండే నల్ల కళ్లద్దాలనే ఆయన వాడుతున్నారు.కాలక్రమేణా కరుణ వయసు పెరగడం,కళ్లద్దాల బరువుకి ఒత్తిడి పెరగడంతో వాటిని మార్చాలని డాక్టర్లు సూచించారు.అలా డాక్టర్ సూచన మేరకు గత ఏడాది నవంబర్లో అంటే 46 ఏళ్ల తర్వాత నల్ల కళ్లద్దాలను మార్చారు.

కళ్లద్దాలను మార్చడం అనేది కూడా అంత తేలిగ్గా ఏం జరగలేదు. ఆయనకు సరిగ్గా నప్పే, తేలికైన ఫ్రేమ్ కోసం దేశ విదేశాల్లో 40 రోజులు గాలించారు. చివరకు విజయ ఆప్టికల్స్ సీఈవో విజయన్ జయరామన్.. ఆయన కోసం జర్మనీ నుంచి తన ఫ్రెండ్ సాయంతో కొత్త కళ్లద్దాలను తెప్పించారు.మార్చిన కళ్లద్దాల ప్రేమ్ కూడా నలుపు రంగుదే…