Why do women breasts swell during $ex ?

శృంగారం రసవత్తరంగా సాగుతున్న సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. హాయిని కలిగించే హార్మోన్స్ విడుదల అవుతాయి. అందుకే మానవ శరీరం ఆ సమయంలో శారీరక సుఖాన్ని పొందుతుంది. ముఖ్యంగా స్త్రీ శరీరంలో జరిగే మార్పుల గురించి చెప్పుకుంటూపొతే రోజు సరిపోదు. క్లిటోరిస్ నుంచి మొదలైయ్యే వేలకొద్ది నెర్వ్ ఎండింగ్స్ లోని మార్పులని ఏమని వివరిస్తాం చెప్పండి. ఈ నెర్వ్ ఎండింగ్స్ ఉత్తేజితం కావడం వలన మెదడులో కూడా ఎన్నో మార్పులు సంభవిస్తాయి. రక్తప్రసరణ మారుతుంది. సుఖం, ఆనందం, తీపిగా ఉండే నొప్పి .. ఎన్నో భావాలు. అలాంటి భావాల నడుమ జరిగే అతిపెద్ద మార్పుల్లో ఒకటి వక్షోజాలు పెరగటం. అది కాసేపైనా ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. మరి వక్షోజాలు ఎందుకు ఆ కాసేపు పెద్దగా అవుతాయి ? దీనివెనుక ఉన్న సైన్స్ ఏమిటి ?

స్త్రీలు శృంగారంలో పొందే సుఖానికి నాలుగు దశలు ఉంటాయి. అవి సెడక్షన్, సెన్సేషన్, సర్రెండర్ మరియు రిఫ్లెక్షన్. సేడక్షన్ అనేది శృంగారం మొదలవడానికి ముందే జరుగుతుంది. అంటే అది మాటల వలన కావచ్చు, చేష్టల వలన కావచ్చు, పార్టనర్ యొక్క శరీరం వలన కూడా కావచ్చు. అర్థమయ్యేలా చెప్పాలంటే కోరిక పుట్టడం. ఆ తరువాతి దశ సెన్సేషన్. అంటే ఫోర్ ప్లే మొదలవడం అనుకోండి. ఈ దశలో తాకిడి వలన, ముద్దుల వలన, లేదా ప్రేరేపణ వలన సెన్సేషన్ ని పొందుతారు. ఈ దశలో కనిపించే మార్పు వక్షోజాలు పెద్దగా అవడం.