Why do women breasts swell and pain at that time ?

పీరియడ్స్ సమయంలో కాదు కాని, పీరియడ్స్ మొదలవడానికి ఓ వారం, పది రోజులు లేదా రెండు వారాల ముందు వక్షోజాలు బరువుగా అనిపించడం లేదా బాగా నొప్పిగా అనిపించడం జరుగుతోందా ? ఇది దాదాపుగా అందరు మహిళలకు జరిగేదే. కాని ఓ అనవసరపు భయం ఉంటుంది. నాకే ఇలా జరుగుతుందేమో, నా శరీరానికే ఎదో జరిగిందేమో అనే భయం. ఆ నొప్పికి కారణం ఏంటో తెలుసుకోవడానికి కూడా మొహమాటపడతారు. అందుకే కారణం ఏమిటో మేము చెబుతున్నాం. ఈ నొప్పి నార్మలా కాదా అనేది తరువాతి విషయం. ముందు ఈ నొప్పి ఎందుకు వస్తుందో చూడండి.

పీరియడ్స్ లో క్రామ్ప్స్ సాధారణ విషయం. ఆ సమయంలో కడుపులో ఎంత నొప్పిగా అనిపించినా భయపడిపోరు అమ్మాయిలు. ఆ సమయంలో ఈ నొప్పి వస్తుందని తెలుసు కాబట్టి భరిస్తారు. కాని 28 రోజుల సైకిల్ తీసుకుంటే, దాదాపుగా 21 రోజున అనుకొండి, వక్షోజాలు చాలా బరువుగా అనిపిస్తుంటాయి. సైజు పెరిగినట్టుగా, బరువు పెరిగినట్టుగా ఇబ్బందిపెడతాయి. ఇది పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి కాదు కాబట్టి ఆందోళన చెందడం సహజం.