Why do Hindus worship the cow

పల్లెటూర్లు,చిన్న చిన్న గ్రామాలలో గోమాతను ఎంతో భక్తితో పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి జీవనం గోవులతో ముడిపడి ఉంటుంది. ఆవులు ఇచ్చే పాలతో వారు జీవనాన్ని గడపటం వలన ఆవులను భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు. ఆలా అని అందరూ పూజలు చేయరు. కొంత మంది మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు.

ఆవును గోమాతగా చెప్పటానికి మన పురాణాల్లో కొన్ని కధలు కూడా ఉన్నాయి. పురాణాల్లో గోవును దేవత స్వరూపంగా చెప్పారు. మన పూర్వీకులు గోవును పూజిస్తే సకల పాపాలు పోతాయని నమ్మకం. అందుకే గోవును పూజించటం ఒక ఆచారంగా మారింది.

గోమాత నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలుగానూ, భ్రూమద్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ – ఇంద్రులు వున్నారు. అంతేకాక కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ – ప్రయాగ నదులు మొదలైనవి వుంటాయి. ఇలాగే గోమాతలో వున్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై ఉండుట వలన మన పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు.