ఆ ఇద్దరూ కాంగ్రెస్ లో ఉన్నా లేనట్టేనా ..     2018-08-18   09:35:28  IST  Sai M

కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగి ఆ పార్టీకి అధికారం ఉన్నన్ని రోజులు మంచి పదవులు పొంది ఇప్పుడు కనీసం ఆ పార్టీ గురించి పట్టించుకోవడమే మానేసిన మెగా స్టార్ చిరంజీవి ప్రస్తావన ఇప్పుడు తెర మీదకు వస్తోంది. ఎందుకంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ హైదరాబాద్ లో పర్యటించినా కనీసం చిరంజీవి పలకరించడానికి కూడా రాలేదు. చిరు ఒక్కడే కాదు తెలంగాణ రాములమ్మగా పేరు పొందిన మాజీ ఎంపీ విజయశాంతి పేరు కూడా ఆ విధంగానే వినిపిస్తోంది.

Congress Party,Rahul Gandhi,ts Congress,Vijaya Shanthi,why Chiranjeevi Not Participating In Congress Party Campaigns

ఈ ఇద్దరు నాయకుల నేపద్యమూ సినిమాలే. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి పొందారు. ఇక విజయశాంతి కూడా టీఆర్ఎస్ తరుపు నుంచి ఎంపీగా గెలిచి రాజకీయాల్లో కొనసాగారు. ఆతర్వాత టీఆర్ఎస్‌ను వదిలి కాంగ్రెస్ లో చేరారు. ఇద్దరూ నేతలు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దానికి కారణం ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియడంలేదు.

కొంతకాలంగా.. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న విజయశాంతి బోణాల సమయంలో బంగారు బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించారు. ఇక చిరంజీవి కూడా సైరా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా రాహుల్‌ను కలవడానికి సమయం లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

Congress Party,Rahul Gandhi,ts Congress,Vijaya Shanthi,why Chiranjeevi Not Participating In Congress Party Campaigns

చిరంజీవి మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి దిగుతారని స్వయంగా… ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. కాని పరిస్తితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. వీరిద్దరూ అసలు పార్టీలో ఉన్నారా లేరా ఉన్నా లేనట్టేనా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఏపీలో అంతంత మాత్రమే.

అందుకే కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్నా అంతగా ఉపయోగం ఉండదు అనేది చిరు అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే చిరు తన తమ్ముడు స్థాపించిన జనసేనలో చేరబోతున్నాడని, అది కూడా ఎన్నికల సమయం లో అనే వార్హలు వినిపిస్తున్నాయి. ఇక రాములమ్మ పరిస్థితి కూడా గందరగోళంగానే ఉందని కాంగ్రెస్ లో ఉండలేక, వెళ్లలేక సతమతం అవుతున్నట్టు తెలుస్తోంది.