చంద్రబాబు సుజనాని దూరం పెట్టడానికి అసలు రీజన్ ఇదే     2018-05-04   02:21:44  IST  Bhanu C

సుజనా చౌదరి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు..ఆయన పేరు చెప్పగానే రాజకీయాలు తెలిసినవాళ్ళు ఆయన చంద్రబాబు కి నమ్మిన బంటు టీడీపి అధికారంలో లేనప్పుడు ప్రధాన ఆర్ధిక వరనరూ అంటారు..మరి కొంత మంది చంద్రబాబు సుజనా మంచి స్నేహితులు అనుకుంటారు అంటే వారి మధ్య ఉండే భంధం అలా కనిపించేది అయితే ఈ మధ్య కాలంలో మీడియాలో సుజనా చౌదరి బీజేపి లోకి వెళ్తున్నాడు అనే ప్రకటన వచ్చిన తరుణంలో పిలో తెలుగుదేశం నేతలు అంతా ఒక్కసారిగా ఆవ్వాక్కాయారు..మీడియా సైతం ఆశ్చర్య పడింది..అయితే ఈ వార్తల్లో నిజమెంత అనే వివరాలలోకి వెళ్తే..


గత ఎన్నికల్లో పొత్తుల కారణంగా 2014లో అటు కేంద్రంలో టీడీపీకి రెండు క్యాబినెట్ ర్యాంక్ పదవులు ఇటు రాష్ట్రంలో బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి..చంద్రబాబు తాను బంటు సుజనాకి, అశోక్‌గజపతి రాజు కు మరొకటి సుజనా చౌదరికి చంద్రబాబు ఇప్పించుకున్నారు..చంద్రబాబుకు , సుజనాచౌదరి టీడీపీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ప్రధాన ఆర్థిక వనరుగా ఉపయోగపడ్డారు. తాను ఇవ్వడమే కాకుండా.. అనేక మంది పారిశ్రామికవేత్తల ద్వారా ఎప్పటికప్పుడు పార్టీకి భూరి విరాళాలు ఇప్పించారు సుజనాచౌదరి. ఈ కారణంగానే, పార్టీ కోసం ఆయన పడిన కష్టానికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు.