పవన్ మంచి వ్యక్తి.... లోకేష్ సాఫ్ట్ డైలాగ్స్..రీజన్ ఇదేనా..     2018-04-27   21:57:54  IST  Bhanu C

తెలుగువాడి ఆత్మ గౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు నందమూరి తారక రామారావు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఏపీని కూకటి వేళ్ళతో సహా పీకి పడేసేలా ఢిల్లీ ఫీటం దద్దరిల్లేలా ఎన్టీఆర్ ఒక ప్రభంజనాన్ని సృష్టించారు..రాబోయే తరాలు ఎవడో దయాదాక్షిణ్యాల మీద బ్రతక కూడదు అంటూ తెలుగు ప్రజలకి తెలుగు వాడే నాయకుడు కావాలి ఢిల్లీ దిగిరావాలి అంటూ ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు తెలుగు ప్రజలలో పౌరుషాన్ని కలిగించాయి దాంతో తెలుగు ప్రజలు అందరు ఒక్కసారిగా ఎన్టీఆర్ కి జై కొట్టి ముఖ్యమంత్రిని చేశారు..ఏపీ రూపురేఖలు మారి పోయాయి..అప్పటి నుంచీ తెలుగు ప్రజలకి ఎన్టీఆర్ ఒక సినిమా నటుడిగా కంటే కూడా ప్రజల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రిగా ఆరాధ్యుడు అయ్యారు..అయితే

ఆ తరువాత చంద్రబాబు పాలన ఎన్టీఆర్ ని మరిపించలేక పోయినా సరే చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా తన మార్క్ పాలన అందించారు అయితే మడమ తిప్పని మాట తప్పని పార్టీ గా అన్న గారు ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని తీర్చి దిద్దారు కానీ చంద్రబాబు మాత్రం ఆదిసగా సక్సెస్ అవ్వలేక పోయారు..ఏపీ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు ఎన్టీఆర్ స్థాపించన తెలుగుదేశం పార్టీయేనా ఇది అనే సందేహం కలుగక మానదు..ఒక పక్క ఎన్టీఆర్ మడమ తిప్పని నేతగా మాట ఇస్తే మరచిపోని నేతగా ఆరాధ్యుడిగా కీర్తించబడుతుంటే..చంద్రబాబు మాత్రం మాటలు తప్పుడు మడమ తిప్పుడు “యూటర్న్” బాబు గా నిలిచి పోయారు.