కరుణానిధిని దహనం చేయకుండా ఖననం చేయడం వెనుక ఉన్న కారణం ఇదే  

డిఎంకె అధినేత కరుణానిది అంతిమ సంస్కారాలు ముగిసాయి. కుటుంబసభ్యులు, రాజకీయ, సినీ ప్రముఖులు, లక్షలాది మంది అభిమానులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో కరుణానిధిని ఖననం చేశారు..అయితే కరుణ పార్ధివ దేహాన్ని దహనం చేయకుండా ఖననం చేయడంపై సందేహాలు వెలువడుతున్నాయి..ఇంతకీ కరుణని ఖననం చేయడం వెనుక కారణం ఏంటంటే..

హిందూ సాంప్రదాయం ప్రకారం చిన్న పిల్లల్ని, సాధువుల్ని, పెళ్లి కాని వారిని తప్ప మిగితా ఎవరూ మరణించిన వారిని దహనం చేస్తారు. కేవలం క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే ఖననం చేస్తారు.కానీ, కరుణానిధిని కూడా ఖననం చేశారు. ఎందుకిలా అంటే కరుణానిధి హిందూ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ.. ఆయన నాస్తికుడు. జీవించినంత కాలం ఆయన తనను తాను నాస్తికునిగానే ప్రచారం చేసుకున్నారు.నాస్తికునిగానే జీవించారు.

తాళికట్టడానికి నిరాకరించి సంప్రదాయ ప్రకారం పెళ్లిచేసుకోలేనని ప్రియురాలినే వద్దనుకున్న కరుణ ఎంతటి నాస్తికత్వాన్ని పాటించేవారో అర్దం చేసుకోవచ్చు..దేవుళ్లకి వ్యతిరేఖంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడం.. .దేవుడు అనేది అబద్దం అంటూ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కరుణానిధి.తన నాస్తికత్వం కారణంగానే కరుణానిధి అభిప్రాయాలకు విలువ ఇస్తూ ఆయనను దహనం చేయకుండా ఖననం చేశారు.