విమానాలకు తెలుపు రంగునే ఎందుకు వేస్తారో తెలుసా.? ఎండ గురించి మాత్రమే కాదు.!    2018-07-03   01:44:23  IST 

గాలిలో ఎగురుతున్నపుడు లేదా ఎయిర్ ట్రావెల్ చేస్తున్నపుడు మనం చూసే ప్రతి విమానం తెలుపు రంగులోనే ఉంటుంది. పేర్లు, డిజైన్లు మరియు కొన్ని పట్టీలు వివిధ రంగుల్లో ఉన్నపటికీ విమానం ఎక్ట్సీరియర్‌లో ప్రధానమైన రంగు మాత్రం తెలుపే ఉంటుంది. విమానాలు ఎందుకు తెల్లగా ఉంటాయి అనేది మీరు పూర్తిగా ఆశ్చర్య పోయేంత ప్రత్యేకమైనది.ఇది ఖచ్చితంగా మీకు ఆలోచనకు కూడా అందనంత ప్రత్యేకం.

అన్ని రంగుల్లో కన్నా తెలుపు రంగు కాంతిని అత్యుత్తమంగా పరావర్తనం చెందిస్తుంది. సూర్యరశ్మి నుండి దాదాపు అన్ని రకాల కాంతిని తెలుపు రిఫ్లెక్ట్ చేస్తుంది.అంతే కాకుండా తెలుపు రంగు మాత్రమే వేడిని గ్రహించదు. మరే ఇతర రంగులతో విమానానికి పెయింట్ చేస్తే, అది సూర్యుని నుండి వచ్చే ఉష్ణోగ్రతను అధిక మొత్తంలో గ్రహిస్తుంది. తద్వారా విమానం యొక్క టెంపరేచర్ పెరిగిపోతుంది.