Why and where did Pawan hide for 30 years?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు పొలిటికల్ మీటింగ్లతో, అటు సినిమా షూటింగ్లతో తెగ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న అజ్ఞాతవాసి దాదాపుగా పూర్తికావచ్చింది. డిసెంబరు ఈ సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తవుతుందని తాజా సమాచారం. జనవరి10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్క్రీన్స్ కౌంట్ తో ఈ సినిమా విడుదల అవడం దాదాపుగా ఖాయం. చిన్నబాబు (రాధకృష్ణ) నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో పవర్ స్టార్ కి జంటగా కీర్తి సురేష్, అను ఎమ్మానుయేల్ కనిపిస్తారు.

ఇక ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. అజ్ఞాతవాసి టైటిల్ కి అనుగుణంగా, అజ్ఞాతవాసం మీదే ఈ సినిమా కథ ఉంటుంది‌. ఇందులో పవన్ ఒకటి కాదు, రెండు కాదు, పది, ఇరవై కాదు, ఏకంగా 30 ఏళ్ళు అజ్ఞాతవాసంలో ఉండి బయటకివచ్చిన యువకుడిగా కనిపిస్తాడట. అన్నేళ్ళు తన గుర్తింపుని మార్చుకోని, దాక్కోవాల్సిన అవసరం ఏం వచ్చింది? అజ్ఞాతవాసం నుంచి బయటకివచ్చిన తరువాత ఆ యువకుడ ఏం చేసాడన్నదే ఈ సినిమా కథ.

ఇలాంటి కథని బాగా ఆర్టిస్టిక్ గా తీసుంటారు, అంతటి క్లాస్ సినిమా రిస్క్ ఎందుకు అని అనుకోకండి. టైటిల్ క్లాస్ అయినా, కథ మాస్ గానే ఉంటుంది. ఇందులో 5 అద్భుతమైన ఫైట్స్ కూడా ఉంటాయట. కాబట్టి యూత్ కి, ఫ్యాన్స్ కి కావాల్సిన అంశాలు ఉంటూనే, కుటుంబ ప్రేక్షకులకి కావాల్సిన బలమైన కథ, ఎమోషన్స్, హాస్యం కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి పవర్ స్టార్ బేఫికర్ గా ఉండొచ్చు.