జనసేన లోకి కొత్త సారధి..బీజేపి భారీ స్కెచ్..  

ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రాజకీయ విశ్లేషకులని సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి..ఏ సమయంలో ఏ పార్టీ ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంటుందో తెలియదు..అంతేకాదు ఏపీలో రాజకీయ పార్టీలు ఎవరు ఎవరితో జతకడుతారో కూడా ప్రస్తుతానికి అంచనాకి కూడా అందటం లేదు..వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగుతానని ప్రకటించిన జనసేన పార్టీ పరిస్థితి అయితే రోజుకో మలుపు తిరుగుతోంది..తాజాగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తుంటే బీజేపి గుప్పెట్లోకి జనసేన వెళ్ళిపోయింది అనే అనుమానాలు కలుగుతున్నాయి అటున్నారు విశ్లేషకులు..వివరాలలోకి వెళ్తే…

బీజేపి తన చేతికి మట్టి అంటుకోకుండా చాలా తెలివిగా ఏపీలో టీడీపి ని దెబ్బకొట్టాలని వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగానే బీజేపీ తెరవెనుక శక్తులు వేసిన అత్యంత పెద్ద ప్లాన్ జనసేనను తమ చేతుల్లోకి తీసుకోవడం. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కి పార్టీపై పట్టు లేకుండా చేసి పూర్తిగా నిస్సహాయమైపోయిన స్థితిలో దేవ్ అనే కొత్త వ్యక్తిని రంగంలోకి తీసుకువచ్చింది అంటున్నారు…అయితే తాజాగా పవన్ తన ఏసీఎఫ్ అనే సంస్థలో ఉన్న 1200 మంది కార్యకర్తల సాయంతో.. జనసేన వ్యవహారాలను దేవ్ చూస్తారని చెప్పుకొచ్చారు…అసలు