ఇప్పుడు వర్మను తన్నేది ఎవరు?     2018-06-01   23:08:10  IST  Raghu V

వివాదాలకు పెట్టింది పేరైన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా నాగార్జునతో ‘ఆఫీసర్‌’ చిత్రాన్ని తెరకెక్కించాడు. గత దశాబ్ద కాలంగా సక్సెస్‌ లేక పోవడంతో కొట్టుమిట్టాడుతున్న వర్మకు ఈ చిత్రం సక్సెస్‌ ఇస్తుందని అంతా భావించారు. ఆయన కూడా ఈ సినిమాతో తాను మళ్లీ మునుపటి వర్మను అవుతాను అంటూ భావించాడు. కాని ఫలితం తారు మారు అయ్యింది. నిన్న విడుదలైన ఆఫీసర్‌ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. వర్మ గతంలో తీసిన సినిమాల కాలిగోటికి కూడా సరిపోలేదు. ఈ చిత్రంను నాగార్జున ఎలా అంగీకరించాడు అంటూ విశ్లేషకులు మరియు అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునను వర్మ పూర్తిగా మోసం చేశాడు అంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

కథ చెబుతున్న సమయంలో నాగార్జునతో వర్మ తప్పకుండా ఈ చిత్రం సక్సెస్‌ అవుతుంది. తాను పూర్తి దృష్టి పెట్టి ఈ సినిమాను తీస్తాను. ఈ సినిమాలో ఎలాంటి కాంట్రవర్సీలు తీసుకు రాకుండా, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా చిత్రీకరిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇప్పుడు నేను చెబుతున్న స్క్రిప్ట్‌లో ఉన్నట్లుగా సినిమా తీయలేదని మీరు అనుకుంటే ఆ సమయంలోనే నన్ను కాలితో తన్నినా కూడా పడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ప్రీ రిలీజ్‌ వేడుకలో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అవును నిజంగానే అలా అన్నాను. ఎందుకంటే సినిమాపై నాకు అంత నమ్మకం ఉంది అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.