Who is behind Blaming Jr. NTR

ఇటీవ‌ల ఉన్న‌ట్టుండి.. జూనియ‌ర్ ఎన్‌టీఆర్ మ‌రోసారి సెంట‌రాఫ్‌ది న్యూస్ అయిపోయాడు. సాధార‌ణంగా ఏ మూవీ ఫంక్ష‌నో అయితే ఇలా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఉండేది కాదు. కానీ, అనూహ్యంగా ఎన్‌టీఆర్ ఓ కొత్త రాజ‌కీయ పార్టీ పెడుతున్నాడ‌ని, దీనికి సంబంధించిన లెట‌ర్ హెడ్‌ల‌తో హ‌ల్‌చ‌ల్ సృష్టించారు. అదికూడా ఏపీలో సీఎం చంద్ర‌బాబు తన‌యుడు నారా లోకేష్ ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌య‌మంలోనే ఇదంతా జ‌ర‌గ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. దీంతో అంద‌రి దృష్టీ జూనియ‌ర్‌పై ప‌డింది.

వాస్త‌వానికి 2009 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌ర‌ఫున‌, టీడీపీకి భారీ ఎత్తున ప్ర‌చారం చేసి పెట్టాడు ఎన్‌టీఆర్‌. ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోయాడు. కానీ, అదేస‌మ‌యంలో నారా వారి వంశానికి చెందిన లోకేష్ మాత్రం పార్టీలో అధికారిక ప‌ద‌వులు చేప‌ట్టాడు. నిజానికి ఎన్‌టీఆర్ మాదిరిగా లోకేష్ ఏనాడూ ప్ర‌చారం కూడా చేయ‌లేదు. అయినా కూడా చంద్ర‌బాబు లోకేష్‌కి పార్టీలోనే కాకుండా మంత్రి ప‌ద‌విని కూడా క‌ట్ట‌బెట్టాడు. దీనిపై ఎవ‌రూ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌లేదు. కానీ, ఎన్‌టీఆర్‌నే టార్గెట్ చేసుకుని ఇలా ప్ర‌చారం చేయ‌డం వెనుక ఏముంద‌నేది అర్థం కావ‌డం లేదు.