Three Heroes Names Escape From Tollywood Drugs List

వీరికి నోటీసులు జారీ చేసిన అధికారులు టాలీవుడ్‌లో కొంద‌రు బ‌డా నిర్మాత‌ల వార‌సుల‌ను వ‌దిలేయ‌డంపై ఇప్పుడు స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టాలీవుడ్‌ను శాసించే ఇద్ద‌రు బ‌డా నిర్మాత‌ల వార‌సుల‌కు డ్ర‌గ్స్ అల‌వాటు ఉంద‌న్న‌ది ఓపెన్ సీక్రెట్‌. ఓ బ‌డా నిర్మాత ఇద్ద‌రు కుమారులు డ్ర‌గ్ ఎడిక్టేలేన‌ట‌. ఇక మ‌రో బ‌డా నిర్మాత పెద్ద కుమారుడు ఓపెన్‌గానే ఒక‌టి రెండుసార్లు ర‌చ్చ ర‌చ్చ చేశాడు. తాజా లిస్టులో వారి పేర్లు కూడా ఉన్నా..వారికి ముందుగానే ఈ ఉందంతం లీక్ అవ్వ‌డంతో వారు జాగ్ర‌త్త ప‌డిన‌ట్టు తెలుస్తోంది. వీరు ముగ్గురు హీరోలే కావ‌డం విశేషం.

మ‌రోవైపు ఎక్సైజ్ అధికారులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. తాము ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌లువురు ప్ర‌ముఖుల‌ను డ్రగ్స్ ఇష్యూలో నిందితులుగా గుర్తిస్తే వారిలో కొంద‌రికి మాత్ర‌మే నోటీసులు జారీ చేయ‌డంపై వారు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక టాలీవుడ్ పెద్ద‌లు త‌మ వార‌సుల‌కు సైతం ఇందులో ప్రమేయం ఉన్నా వారు డ్ర‌గ్స్ వాడే వాళ్ల వ‌ల్ల ఇండ‌స్ట్రీకి చెడ్డ‌పేరు వ‌స్తోందంటూ నీతులు చెప్ప‌డం మ‌రీ విడ్డూరంగా ఉంద‌ని ఇండ‌స్ట్రీలోనే కొంద‌రు వాపోతున్నారు. కేవ‌లం చిన్న చేప‌లనే టార్గెట్ చేసి పెద్ద‌వాళ్ల‌ను వ‌దిలేయ‌డంపై ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.