Three Heroes Names Escape From Tollywood Drugs List

సినిమా ఇండ్రస్టీ అంటేనే ఓ మాయా జగత్తు. ఇక్క‌డ హిట్లు ప‌డితే ఎవ‌రైనా సింగిల్ నైట్లో స్టార్లు అయిపోవ‌చ్చు. ఒక్క సినిమా హిట్ అయితే ఎంత ఎత్తుకు వెళ్లిపోతారో..ఒక్క ప్లాప్ ప‌డితే అంతే కింద‌కు వ‌చ్చేస్తారు. ఇందుకు ఎవ‌రో కాదు పూరి జ‌గ‌న్నాథే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌తో వ‌రుస‌గా హిట్లు ఇచ్చిన పూరి…ఇప్పుడు వ‌రుస ప్లాపులు ఇస్తున్నారు. దీంతో పూరికి ఛాన్సులు ఇచ్చేందుకే కాదు..క‌నీసం ఆయ‌న‌తో మీట్ అయ్యేందుకే స్టార్ హీరోలు ఇష్ట‌ప‌డ‌ని స్టేజ్‌కు ఆయ‌న దిగ‌జారిపోయారు.

హీరోల‌కు, హీరోయిన్ల‌కు, ద‌ర్శ‌కుల‌కు కోట్ల‌లోనే ఫ్యాన్స్ ఉంటారు. మ‌రి అంత టాప్ పొజిష‌న్‌లో ఉన్న వాళ్లు ఎంత ఆద‌ర్శంగా ఉండాలి. అయితే కోట్లాది మందికి ఆద‌ర్శంగా ఉండేవాళ్లు ఎలా ఉండాలి. కానీ మ‌న టాలీవుడ్ సెల‌బ్రిటీలు చేస్తోందేంటి ? తాజా డ్ర‌గ్ ఉదంతం టాలీవుడ్ ప‌రువును బ‌జారుకి ఇడ్చేసింది. ఇక తాజా ఉదంతంలో ఎక్సైజ్ అధికారులు ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్లు ముమైత్‌ఖాన్‌, చార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్‌, కెమెరామేన్‌ శ్యాంకే నాయుడు, హీరోలు నవదీప్‌, తరుణ్, తనీష్‌, కేరక్టర్‌ ఆర్టిస్టు సుబ్బరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా తదితరులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.