వైట్ హెడ్స్ రావటానికి కారణాలు

వైట్ హెడ్స్ ని ఇంటి నివారణలు మరియు సహజ నివారిణులతో నయం చేసుకోవటానికి ముందు అవి ఎలా వస్తాయో తెలుసుకోవాలి. సిబం గ్రీవములో ఇరుక్కుపోయినప్పుడు వస్తాయని తెలుసు. అయితే చర్మ రంద్రాలకు అడ్డంకులు ఎందుకు ఏర్పడతాయో కారణాలు తెలుసుకుందాం.

1. హార్మోన్ల మార్పులు
యుక్తవయస్సు, ఋతుస్రావం, గర్భం మరియు మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా వైట్ హెడ్స్ ఏర్పడతాయి. హార్మోన్ల మార్పులు జరిగే సమయంలో సిబం ఎక్కువగా స్రవించటం వలన వైట్ హెడ్స్ ఏర్పడతాయి. ఇవి పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా వస్తాయి.

2. కొన్ని మందులు
హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేసే కుటుంబ నియంత్రణ మాత్రల వంటి కొన్ని మందుల వలన వైట్ హెడ్స్ మరియు మోటిమలు ఏర్పడతాయి.