ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు మీ తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి..అందరూ తెలుసుకోండి     2018-05-26   05:57:24  IST  Lakshmi P

తెల్ల జుట్టు ఇది ఒకరి సమస్యే కాదు చాలా మంది బాధపడుతున్న సమస్య..జుట్టు తెల్లబడడానికి అనేక కారణాలు ఉంటాయి.విటమిన్ల లోపం మరియు ముఖ్యంగా వంశ పారంపర్యం కారణంగా కూడా జుట్టు తెల్లబడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆహార లోపాలు, ఒత్తిడి వంటివి కూడా దీనికి కారణం. వాతావరణ కాలుష్యం కూడా దీనికి ఒక కారణమే. థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి, ఆందోళన, హెయిర్ ఫాల్స్ కు వాడే షాంపూలు కూడా జుట్టు తెల్లబడేందుకు దోహదం చేస్తున్నాయి. ఈ రోజుల్లో వయస్సు తో సంబంధం లేకుండా అందరి వెంట్రుకలు తెల్లబడుతున్నాయ్. టూత్ పేస్ట్, సోపు, షాంపూలు కొనుక్కున్నట్లే ప్రతి ఇంట్లో ఓ హెయిర్ కలర్ డబ్బా ఫ్యామిలీ ప్యాక్ లాగా ఉంచుకోవాల్సి వస్తోంది.

ఎప్పుడూ ఒకే రకమైన షాంపూను వాడడం మంచిది. మన ఇంట్లో దొరికే వాటితో సహజమైన చిట్కాలతో తెల్ల జుట్టును ఈజీగా నల్లగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తెల్ల జుట్టును అధిగమించేందుకు నిపుణులు ఇచ్చే సలహాల్లో టాప్ 4 టిప్స్ ఇప్పుడు చూద్దాం.. ఆ నాలుగు టిప్స్ లో ఏ ఒక్కటి పాటించినా తెల్ల జుట్టు దెబ్బకు మాయమైపోతుందని వెల్లడిస్తున్నారు. లేదంటే వారానికి ఓ టిప్ చొప్పున మార్చి మార్చి వాడినా సరే సమస్య నుంచి బయటపడొచ్చు..