WhatsApp to come up with a colorful update soon

ఆన్ లైన్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ మరో పెద్ద మార్పుని తీసుకొస్తోంది. ఈమధ్యకాలంలో వాట్సాప్ తీసుకొచ్చిన మార్పులన్నిటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్నాప్ చాట్, ఇంస్టాగ్రామ్ తరహాలో తెచ్చిన స్టేటస్ అప్డేట్ ఆప్షన్ యూజర్లని విపరీతంగా ఆకట్టుకుంది. ఎంతలా అంటే, ఇప్పటివరకు ఈ స్టేటస్ అప్డేట్ ని వాడుతున్నవారు ఏకంగా 250 మిలియన్ల మార్కుని దాటారట. ఇంతమంది టోటల్ యూజర్స్ కూడా ఉండరు మిగితా మెసేజింగ్ యాప్స్ కి. ఇక మీరే ఊహించుకోండి ఈ ఆప్షన్ ఎంత హిట్ అయ్యిందో. ఈ ఆప్షన్ వలన పాతరకం స్టేటస్ అప్డేట్ పై మోజు తగ్గినా, అదేమీ పెద్ద ఎఫెక్ట్ చూపించడం లేదు. బిలియన్ యూజర్ల వాట్సాప్ డామినేషన్ రోజు రోజుకి పెరుగుతోంది

త్వరలో వాట్సాప్ 24 హౌర్ స్టేటస్ అప్డేట్ కలర్ ఫుల్ గా మారబోతోంది. అంటే కొన్నిరోజుల తరువాత ఆకర్షణీయమైన కలర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మీద మీరు స్టేటస్ పెట్టవచ్చు అన్నమాట. ఇది వింటే మీకు ఫేస్ బుక్ ఆప్షన్ గుర్తొచ్చిందా ? వాట్సాప్ ఫేస్ బుక్ వారిదే కదా. అందుకే ఫేస్ బుక్ లో హిట్ అయిన కలర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్టేటస్ ని వాట్సాప్ లోకి కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటివరకైతే ఇది ఇంకా టెస్టింగ్ మోడ్ లో ఉంది. రెండుమూడు రొజులలో బెటా యూజర్లకి ఈ ఆప్షన్ అందుబాటులోకి రావొచ్చు అని అంచనా. ఆ తరువాత బెటా వినియోగదారుల రెస్పాన్స్ ని బట్టి నార్మల్ యూజర్లకి ఎప్పుడు ఈ ఆప్షన్ ని వదిలేది చెబుతారు. బాగుంది కదా ఆప్షన్. ఇది అందుబాటులోకి వచ్చాక, స్టేటస్ అప్డేట్స్ సంఖ్య మరింతగా పెరుగుతుందని వాట్సాప్ భావిస్తోంది.

ఇదికాకుండా, వాట్సాప్ రీసెంట్ గా మరికొన్ని మార్పులని ఇచ్చింది. ఎమోజీలా సంఖ్య పెంచిన వాట్సాప్, ఆ ఎమోజీలను సెర్చ్ చేసుకునే ఆప్షన్ ని ఇచ్చింది. అలాగే ఫోటోలు, విడియోలనే ఇంతకాలం అనుమతించిన వాట్సాప్, ఇప్పుడు ఎన్నోరకాల ఫైల్స్ ని షేరింగ్ సపోర్టు చేస్తోంది. ఇక రాబోతున్న అప్డేట్స్ లో మెసేజ్ ని అన్సెండ్ చేయడం, పేమెంట్స్ చేయడం, అలాగే రికాల్ ఫీచర్ ఉన్నాయి.