WhatsApp introduces emoji search option

అన్ లైన్ మెసేజింగ్ దిగ్గజం తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆప్షన్ ని తీసుకొస్తూనే ఉంది. ఇంటర్ ఫేస్ మార్పిడి, వీడియో కాల్, ఆడియో కాల్ కి సపరేట్ బటన్స్, స్నాప్ చాట్, ఇంస్టాగ్రామ్ లా స్టోరీస్, పాత స్టేటస్ అప్డేట్ ని వెనక్కి తీసుకురావడం, GIF, అన్నిరకాల ఫైల్ షేరింగ్ .. ఇలా కుప్పకూలుగా కొత్త అప్డేట్స్ ఇచ్చిన వాట్సాప్ తాజాగా మరో సూపర్ అప్డేట్ ని తీసుకొచ్చింది. దాంతో చాటింగ్ మరింత సులభతరం కానుంది.

వాట్సాప్ లో చాట్ చేసేటప్పుడు emoji వాడటం చాలా మామూలు విషయం. అదే క్లోజ్ ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నప్పుడో లేదంటే గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ తోనో చాట్ చేస్తునప్పుడు ఈ ఎమోజీలు ఇంకా ఎక్కువ వాడుతుంటాం. చెప్పాలంటే మ్యాటర్ తక్కువ ఎమోజీలు ఎక్కువ. కాని ఇలా ఎమోజిలు ఎంటర్ చేయాలంటే చాలా టైమ్ పడుతుంది. ఎందుకంటే మనం చెప్పాలనుకున్న భావానికి ఎమోజిని దొరకబట్టాలంటే స్లైడ్ చేసుకుంటూ వెతుక్కోవాలి. ఇలా కొంత సమయం వృధా అవుతుంది. కాని ఇకనుంచి అంతలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకు emojiలను సెర్చ్ చేసే ఆప్షన్ ఇచ్చేసింది వాట్సాప్.

మీరు ఎమోజి బటన్ మీద నొక్కగానే ఈ పిక్ లో కనిపిస్తున్నట్టుగా ఎడమవైపు కింది భాగంలో మీకు సెర్చ్ బటన్ కనబడుతుంది. అక్కడ మీరు wow అని టైప్ చేయగానే వావ్ ఎమోజిలు అన్ని దర్శనమిస్తాయ. India అని టైప్ చేసే జాతీయ పతాకం సింబల్ కనబడుతుంది. Love అని టైల్ చేస్తే లవ్ మీద వాట్సాప్ ఇస్తున్న ఎమోజిలు అన్ని ఒకేసారి కనబడతాయి. అందులో మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోని మెసెజ్ లో పెట్టడమే తరువాయి. ఇలా మీరు ఏ భావాన్ని అయిన ఎమోజి రూపంలో సెకన్లలో కష్టం లేకుండా పెట్టుకోవచ్చు. బాగుంది కదా ఆప్షన్.

అయితే ఈ ఆప్షన్ ఇంకా నార్మల్ వినియోగదారులకి అందుబాటలోకి రాలేదు. బెటా యూజర్లకి తాజాగా వదిలిన ఆప్షన్ ఇది. మరికొన్ని రోజుల్లోనే నార్మల్ వినియోగదారులకి ఈ ఆప్షన్ అందించనుంది వాట్సాప్.