మెగాస్టార్ కి, ఏఅర్ రెహమాన్ కి ఏంటి గొడవ?

సైరా నరసింహారెడ్డి … బాహుబలి తరువాత బాహుబలి అంతటి ప్రాజెక్టు. దీన్ని దేశవ్యాప్తంగా ఓ సంచలనం చేయాలని కంకణం కట్టుకున్నారు మెగాస్టార్. అందుకు తగ్గట్టుగానే ఇటు దక్షిణాది ఇండస్ట్రీల నుంచి, అటు బాలివుడ్ నుంచి తారలను తీసుకొచ్చి తమ ప్రాజెక్ట్ లో పెట్టుకున్నారు. తమిళం నుంచి విజయ్ సేతుపతి లాంటి క్రేజీ హీరో, లేడి సూపర్ స్టార్ నయనతార, కన్నడ నుంచి సుదీప్, ఇక బాలివుడ్ నుంచి అయితే ఏకంగా అమితాబ్ బచ్చన్ ఈ భారి బడ్జెట్ సినిమాలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ అంటే, నిజంగానే భారి బడ్జెట్. వంద కోట్లు కాదు, 180 కోట్లకు పైగా ఖర్చుపెట్టి దీన్ని మరో బాహుబలి చేయాలని చూస్తున్నారు. ఈ 180 కోట్లు కాలక్రమంలో 200 కోట్లు దాటినా దాటోచ్చు.