నవరత్నాలను ఎందుకు ధరిస్తారో తెలుసా?     2018-05-15   23:45:04  IST  Raghu V

నవరత్నాలు భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో రత్నాలు ఉన్నా నవరత్నాలకు మాత్రమే ప్రత్యేక స్థానం ఉంది. మన జాతకం చూసి మనకు నప్పే రత్నాన్ని ఉంగరంగా చేయించుకోమని జ్యోతిష్య నిపుణులు చెప్పుతూ ఉంటారు. ఒక్కో రత్నానికి ఒక్కో ప్రత్యేకతలు ఉంటాయి. ఏ రత్నం పడితే ఆ రత్నాన్ని పెట్టుకోకూడదు. జాతకంలో మన నక్షత్రం,రాశిని బట్టి మాత్రమే నవరత్నాలలో మనకు సెట్ అయ్యే రత్నాన్ని మాత్రమే ధరించాలి.

వజ్రము, వైఢూర్యము, మరకతము, మాణిక్యము, పుష్యరాగము, గోమేధికము, పగడము, ముత్యము, నీలము వీటిని నవరత్నాలు అని అంటారు. వీటిలో వజ్రంను ఎక్కువగా ఆడవారు ధరిస్తారు. వారు దీనిని స్టేటస్ సింబల్ గా భావిస్తారు. ఒక్కో రత్నం ఒక్కో గ్రహానికి ప్రతీక. గ్రహ స్థితి బాగోలేనప్పుడు ఆ గ్రహానికి ప్రతీక అయినా రత్నాన్ని ధరిస్తే గ్రహ సమస్యలు తొలగిపోతాయి.