మీకు కాబోయే భాగస్వామి రాశి గురించి తెలుసుకోవలసిన విషయాలు     2018-03-04   23:20:22  IST  Raghu V

What Zodiac Sign Will You Marry?

ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంను అర్ధం చేసుకోవటానికి మరియు గుణగణాలు తెలుసుకోవాలంటే రాశి చక్రాన్ని పరిశీలించాలి. ఈ పరిశీలన కారణంగా జీవితంలో ఏమైనా సమస్యలు ఏర్పడితే ముందుగా తెలుసుకొని బయటపడవచ్చు. అందువల్ల మీ భాగస్వామి యొక్క రాశి గురించి కూడా తెలుసుకుంటే వారి మీద ఒక అవగాహనా కలిగి జీవితం ఆనందమయం చేసుకోవచ్చు.

ముఖ్యంగా పెళ్లి కుదిరినవారు కూడా మీ భాగస్వామి యొక్క రాశి చక్రాన్ని పరిశీలిస్తే వారి స్వభావం ముందే తెలుస్తుంది. దానికి అనుగుణంగా వారిని అర్ధం చేసుకోవటానికి మానసికంగా సిద్ధం కావచ్చు. ఇప్పుడు ఏ రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

మేష రాశి
వీరు ఏ పని చేసిన ఒకటికి రెండు సార్లు అలోచించి మాత్రమే చేస్తారు. అన్నింటిలోనూ ముందు ఉండాలని భావిస్తారు. అలాగే ఉంటారు కూడా. వీరిలో మానసిక దృఢత్వం చాలా ఎక్కువగా ఉంటుంది.

వృషభ రాశి
వీరు ఎంచుకున్న మార్గంలోనే వెళతారు తప్ప ఎవరైనా చెప్పితే అసలు వినరు. వీరికి కాస్త మొండి పట్టుదల ఎక్కువే. వీరు ఏదైనా పని చేస్తే అంకితభావంతో చేస్తారు. వీరు ఎవరి కోసం వారి ఆలోచనాధోరణిని మార్చుకోరు. ప్రేమించిన వారి కోసం ప్రాణం ఇవ్వటానికి అయినా సిద్ధపడతారు.

మిధున రాశి
ఈ రాశి వారు అందరిలో ఉన్నతంగా,ఆకర్షణీయంగా ఉంటారు. వీరి ఆలోచన విధానం కారణంగా వీరిని అంచనా వేయటం చాలా కష్టం. ఏదైనా సమస్య వస్తే మాత్రం పరిష్కారం కోసం పట్టు విడవకుండా ప్రయత్నం చేస్తారు.

కర్కాటక రాశి
ఈ రాశి వారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తాము ప్రేమించిన వారి కోసం ఏమి చేయటానికి అయినా సిద్ధంగా ఉంటారు. వీరి వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటుంది.

సింహ రాశి
ఈ రాశి వారు ప్రతి విషయంలో తమకే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటారు. వీరు ఏ విషయాన్నీ అయినా సున్నితంగా అర్ధం చేసుకొనే మనస్సు కలిగి ఉంటారు. వీరు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తారు.