ఈ 9 లో మీకు ఇష్టమైన పండుని బట్టి మీరెలాంటి వారో చెప్పొచ్చు.! ఎలాగో తెలుసా.?     2018-06-15   04:03:19  IST  Raghu V

కొన్ని సర్వేలు భలే గమత్తుగా ఉంటాయి. మన అభిరుచిని బట్టి మన మనస్తత్వాన్ని లెక్కగడతాయి. నిన్నటి వరకు రక్త వర్గాలను బట్టి మనస్తత్వాన్ని చెప్పింది ఓ సర్వే, ఇప్పుడు మరో కొత్త సర్వే ప్రచారంలోకి వచ్చింది. మీకు ఇష్టమైన ప్రూట్ ను బట్టి మీ మనస్తత్వాన్ని అంచనా వేస్తోంది ఈ సర్వే.. మరి మీకిష్టమైన ప్రూట్ ఏది ? దానిని ఇష్టపడే మీ మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోండి( ఇది కేవలం సర్వే మాత్రమే.. ఇది మీ విషయంలో నిజం కావొచ్చు, కాకపోవోచ్చు-షరతులు వర్తిస్తాయి అనే టైప్ అన్నమాట.)

అరటి పండు:

మీరు సాధారణ వ్యక్తిత్వం గలవారు. త్వరగా సర్దుబాటు చేసుకోగల మనస్తత్వం వీరిది. అవసరాన్ని బట్టి మెలుగుతుంటారు. డబ్బు ను ఆదా చేయడంలో వీరు
ముందు వరుసలో ఉంటారు. అందంపైన అంతగా శ్రద్ద చూపరు.

జామపండు:

ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పిసినారితనం వీరికి చిరునామ.పాత పద్దతులు ఫాలో అవుతుంటారు. పూర్వపు ఆస్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వీరు తమ జేబులో చిల్లర డబ్బులు తప్పక మేయింటేన్ చేస్తారు.

ఆపిల్:

వీరి సంపాదనలో సగం అందానికే ఖర్చు చేస్తారు.ఫెయిర్ అండ్ లవ్లీలు, ఫెయిర్ నెస్ క్రీమ్ లు…ఇలా వీరి బడ్జెట్ లో చాలా వరకు సౌందర్యలేపనాలకే వెచ్చిస్తారు. చిన్న చిన్న విషయాలు పెద్దగా పట్టించుకోరు. హుందాగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. పని విషయంలో పరమ బద్దకస్తులు.