మీకిష్టమైన రంగుని బట్టి మీ ప్లస్ లు, మైనస్ లు మీకోసం..     2018-08-15   10:57:45  IST  Sainath G

జాతకాలు ,రంగు రాళ్లు ఇతరత్రా విషయాలను మూఢనమ్మకాలు అని కొట్టేసినప్పటికి,సైకాలజిని చాలామంది నమ్ముతారు..మనుషుల అలవాట్లను బట్టి వారివారి వ్యక్తిత్త్వాలను, ఇష్టాలను బట్టి వారి ఆటిట్యూడ్ ను, స్పందించే తీరును బట్టి వారి మెచ్యురిటీ లెవల్ ను అటుఇటుగా లెక్కకట్టొచ్చు.. అందులో భాగమే ఈ కలర్ సైకాలజి.నచ్చిన కలర్ ను బట్టి సదరు వ్యక్తి ప్లస్ లు ,మైనస్ లు ఎలా ఉంటాయో తెలుపుతుంది కలర్ సైకాలజి..మీ మీ ఇష్టమైన రంగుల్ని బట్టి మీ సైకాలజి ఏంటో తెలుసుకోండి.

తెలుపు:

Plus: మంచి ఆలోచనలు ఉంటాయి, టెన్షన్స్ తక్కువ, ప్రశాంతత ఎక్కువ,

Minus: ఎవరిని పడితే వారిని త్వరగా నమ్ముతారు, మోసపోవడం అలవాటు.

లేత పసుపురంగు:

Plus:తెలివి ఎక్కువ ,నిద్ర ప్రియులు , శృంగార కాముకులు.

Minus: ఆరోగ్యాన్ని పట్టించుకోరు, తమనుతాము ఎక్కువగా ఊహించుకుంటారు, కోపం ఎక్కువ.

ఎరుపు:

Plus:ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. సామాజిక బాధ్యత ఎక్కువ.

Minus: తమలాగే ప్రతి ఒక్కరు ఉండాలని అనుకుంటారు. చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటారు.

Blue,Favorite Color,Green,Red,Says About You,White

ఆకుపచ్చ:

Plus: లీడర్ లక్షణాలు ఎక్కువ, అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ప్యూచర్ మీద పక్కా ప్లానింగ్ ఉంటుంది.

Minus: ఈర్ష్య, అసూయలు ఎక్కువ, అనుకున్నదానిని సాధించడం కోసం పక్కవాళ్లను ఇబ్బంది పెట్టడానికి కూడా వెనుకాడరు.

లేత నీలం:

Plus: మెచ్యురిటీ లెవల్స్ ఎక్కువ, ఇట్టే ప్రేమలో పడిపోతారు. మనుషులంటే మంచోళ్లు అనే బేసిక్ ప్రిన్సిపుల్ ఫాలో అవుతారు.

Minus: వీరి మంచితనం బయటికి చేతగాని తనంగా కనిపిస్తుంటుంది, వీరి గురించి డెప్త్ గా తెలియనంత వరకు ఫ్రెండ్స్ వీరిని చులకనగా చూస్తుంటారు.

గులాబి:

Plus: దైవ భక్తి ఎక్కువ, తమదైన వారంలో పక్కగా దేవుడి దర్శనం, పుణ్యక్షేత్రాల పర్యటనను పెట్టుకుంటారు. సహాయం చేయడంలో ముందుంటారు.

Minus: మూఢనమ్మకాలు ఎక్కువ, డబ్బును వృథా గా ఖర్చు చేస్తారు.

ఊదా:

Plus: వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు, డబ్బు విలువ తెలిసి వ్యవహరిస్తారు.

Minus: అనవసర గొడవలకు కారకులవుతారు.ఇతరులను లెక్క చేయరు.

గోధుమ:

Plus: ఎందరిలో ఉన్న వీరే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా ఉంటారు. ఏదో ఒక రంగంలో విశిష్ట ప్రావీణ్యం కలిగి ఉంటారు.

Minus: పొగరు, గర్వం అధికం.

కాషాయం:

Plus: అందం మీద దృష్టి ఎక్కువ, ప్రయాణాలన్న ఇష్టమే…పోటీతత్త్వం ఎక్కువ.

Minus: వీరిలో కూాడా ఈర్ష్య , అసూయలు ఎక్కువే, అలసట ఎక్కువ.

బ్లాక్:

Plus: మొండి ధైర్యం ఎక్కువ, నలుగురిలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని ఆరాడపడతారు. దైవభక్తి తక్కువ.

Minus: ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కలుపుగోలు తత్త్వం చాలా తక్కువ.